గత నెల రోజులుగా బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర తాజాగా స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,160గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,900గా ఉంది. వెండి కిలో రూ.75,000 చేరింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,160 ఉండగా.. విశాఖపట్నంలో కూడా రూ. 63,160 ఉంది.
కరీంనగర్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,160 గా ఉంది. ముంబైలో, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 58,900 కాగా, అదే మొత్తంలో 24 క్యారెట్ల బంగారం విలువ రూ. 63,160గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,050 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వర్ణం ధరరూ. 63,310గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,390 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,710గాఉంది.

ప్రపంచ మార్కెట్ లో కూడా పుత్తడి ధరలు పెరుగుతోన్నాయి. స్పాట్ ఔన్స్ ధర 2032 డాలర్లుగా ఉంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 22.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారతీయ రూపాయి మారకం విలువ డాలర్ తో పోలిస్తే రూ. 83.057 వద్ద కొనసాగుతోంది.
బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాల స్వచ్ఛత 99.9, 23 క్యారెట్ 95.8, 22 క్యారెట్ 91.6, 21 క్యారెట్ 87.5, 18 క్యారెట్ 75.0 గ్రాములు అని రాసి ఉంటుంది.
24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలు కలపడం ద్వారా ఆభరణాలు తయారు చేస్తారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications