2025 ఏడాదిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవంగా చెప్పకోవచ్చు. గతేడాదిలో మానవులకు సాధ్యం కావనుకున్న ఎన్నో టెక్నాలజీలు ఏఐతో సాధ్యం అయ్యాయి. అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమే. అసలైన సినిమా 2026 లో చూడబోతున్నాం. నిజమే! ఇప్పటివరకు ఏఐ అంటే కేవలం అడిగిన దానికి సమాధానం చెప్పడం మాత్రమే అని మనందరికీ తెలుసు. కానీ 2026 నాటికి ఇది "థింకింగ్ మెషిన్" నుంచి "డూయింగ్ మెషిన్" గా రూపాంతరం చెందబోతోంది. ఇదెలా ఉంటుందంటే..

ఏజెంటిక్ ఏఐ (Agentic AI) రాకతో అంతా మాయాజాలం!
ప్రస్తుతం మనం చాట్ బాట్‌లకు ప్రాంప్ట్‌లు ఇస్తున్నాం. కానీ 2026 లో "ఏజెంటిక్ ఏఐ" రంగప్రవేశం చేయబోతోంది. అంటే మీరు మీ ఏఐ అసిస్టెంట్‌కి "వచ్చే నెల నేను తిరుపతి వెళ్లాలి, బడ్జెట్ 10 వేలు" అని చెబితే చాలు.. అది టికెట్లు బుక్ చేయడం నుంచి, హోటల్ రూమ్స్ సెట్ చేయడం వరకు అన్ని పనులను స్వయంగా పూర్తి చేస్తుంది. మీరు పక్కన కూర్చుని కేవలం పర్యవేక్షిస్తే సరిపోతుంది.
ఉద్యోగ మార్కెట్‌లో పెను మార్పులు
చాలా మందికి ఒక సందేహం ఉంది.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా? అని. నిజానికి పాత పద్ధతుల్లో పనిచేసే వారికి ముప్పు ఉండొచ్చు. కానీ, 2026 నాటికి కొత్త రకమైన ఉద్యోగాల జాతర మొదలవుతుంది. ఏఐ ట్రైనర్స్, ఏఐ ఎథిక్స్ ఆఫీసర్స్ వంటి కొత్త పోస్టులు పుట్టుకొస్తాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో కోడింగ్ రాయడం కంటే, ఏఐ రాసిన కోడ్‌ను సరిచూసే (Review) నైపుణ్యం ఉన్నవారికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
వ్యక్తిగత వైద్యం, విద్య
2026 లో విద్యార్థులకు ట్యూషన్ టీచర్ల అవసరం ఉండకపోవచ్చు. ప్రతి విద్యార్థికి ఒక పర్సనల్ ఏఐ మెంటర్ ఉంటుంది. విద్యార్థికి ఏ సబ్జెక్ట్ అర్థం కావడం లేదో గుర్తించి అతనికి నచ్చిన పద్ధతిలో ఏఐ వివరిస్తుంది. అలాగే వైద్య రంగంలో మీ జీన్ డేటా (DNA) ఆధారంగా ఏఐ మీకు ఎలాంటి మందులు వాడాలో సలహా ఇస్తుంది.
మన డైలీ లైఫ్ ఎలా ఉండబోతుంది?
- స్మార్ట్ హోమ్స్: మీరు ఇంటికి రాకముందే మీ మూడ్‌ని బట్టి ఏఐ లైటింగ్, ఏసీని సెట్ చేస్తుంది. మీరు ఇంట్లో స్విచ్చులు ఆన్ చేయడం, టీవీ పెట్టుకోవడం లాంటివి చేయాల్సిన అవసరం లేదు.
- క్రియేటివిటీ: ఒక్క నిమిషంలో సినిమా క్వాలిటీ ఉన్న వీడియోలను ఏఐ ద్వారా ఎవరైనా తయారు చేయవచ్చు. అంతేకాదు డైరెక్ట్ గా ఏఐతో క్రియేట్ చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ లను కూడా మనం 2026లో చూడొచ్చు.
- సైబర్ సెక్యూరిటీ: ఆన్‌లైన్ మోసాలను పసిగట్టి ముందే మనల్ని అలర్ట్ చేసే అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ సిస్టమ్స్ అందుబాటులోకి వస్తాయి. ఇకపై సైబర్ నేరగాళ్ల ఆటలు అంతగా సాగవు.
మొత్తంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే.. 2026 అనేది టెక్నాలజీ చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోతుంది. అయితే మనమంతా ఏఐని ఒక శత్రువులా కాకుండా మన సామర్థ్యాన్ని పెంచే ఒక ఆయుధంగా మలచుకోవాలి. అప్పుడే ఈ వేగవంతమైన ప్రపంచంలో మనం రాణించగలం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications