ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వరదలు వణికించాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం వారం రోజుల పాటు భారీ వర్షాలతో విలవిలలాడింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇప్పటికీ వరద నీటిలోనే చిక్కుకుని ఉంది. భారీ వరదలకు రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. రోడ్లు చెరువులను తలపించాయి. వేలాది ఎకరాల్లో పంటలు భారీ వర్షానికి నాశనమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ వర్షాలను, విపత్తులను ముందుగా అంచనా వేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది.
భారీ వర్షాలు వస్తాయనే వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు ఖచ్చితత్వంతో ఉన్నా కొన్ని సార్లు అవి అంచనా తప్పుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు కొంత మేర ఉపశమనం ఇస్తున్నా పూర్తి స్థాయిలో ఇది వర్కౌట్ కావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఏఐ ప్రపంచాన్ని శాసించేస్థాయికి ఎదుగుతోంది. ఉద్యోగులు చేసే పనిని అది చేస్తూ శ్రామిక రంగంలో తన పాత్రను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది.

ఏఐ భవిష్యత్తులో జరిగే మార్పులను పసిగట్టగలదా: ఇటువంటి పరిస్థితుల్లో ఏఐ భవిష్యత్తులో జరిగే మార్పులను పసిగట్టగలదా.. సునామీలను, తుఫానులను ముందుగానే అంచనా వేసి చెప్పగలదా.. భారీ వరదలు రాబోతున్నాయని ముందుగానే అలర్ట్ మెసేజ్ ఇవ్వగలదా.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు కళ్లముందు కదలాడుతున్నాయి. ఈ మధ్య ఎన్నో సునామిలు, తుఫానులు ప్రపంచాన్ని వణికించిన సందర్భంలో దీని గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
డీప్‌మైండ్ సృష్టించిన ఆల్ఫాఎర్త్: కృత్రిమ మేధస్సు (AI) ఇప్పుడు మనకు పర్యావరణ మార్పులను ముందుగానే అంచనా వేసే స్థాయికి చేరుకుంది. గూగుల్‌కి చెందిన డీప్‌మైండ్ రూపొందించిన ఆల్ఫాఎర్త్ (AlphaEarth) అనే వ్యవస్థ భూమిని దాదాపు రియల్ సమయంలో పర్యవేక్షించి, రాబోయే విపత్తులు లేదా పెద్ద మార్పులను గుర్తించగలదు. ఇది సాధారణ AI మోడల్ కాదు, భూమి మొత్తాన్నే వర్చువల్ ఉపగ్రహంలా కంటిన్యూగా పరిశీలించే ఒక తెలివైన పర్యవేక్షణ వ్యవస్థ.ఇంకా చెప్పాలంటే.. పర్యావరణ విపత్తులను ముందుగానే గుర్తించే AIగా చెప్పుకోవచ్చు.
ఉపగ్రహాల కంటే ముందే అర్థం చేసుకునే టెక్నాలజీ: సాంప్రదాయ ఉపగ్రహాలు లక్షలాది ఫోటోలు తీస్తుంటాయి. అయితే వాటిని విశ్లేషించడానికి చాలా సమయం పడుతుంది. ఎక్కువ డేటా మానవులకు తెలియకుండా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆల్ఫాఎర్త్ ఈ సమస్యను అధిగమించి మనుషులకు క్లియర్ సందేశాన్ని అందిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఫోటోలు మాత్రమే చూడదు.. వాటిని అర్థం చేసుకుంటుంది. మన కళ్ళు గుర్తించలేని చిన్న చిన్న మార్పులను కూడా ఇది వెంటనే గుర్తిస్తుంది. దాని గురించి ప్రపంచానికి తెలియజేస్తుంది.
ఉదాహరణకు: అమెజాన్ అడవుల్లో నెమ్మదిగా జరుగుతున్న అటవీ నిర్మూలన. ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు కరిగిపోవడం,ఆఫ్రికా పట్టణాల్లో వేగంగా జరుగుతున్న నగరీకరణ వంటి మార్పులను వెంటనే పసిగట్టి సమాచారం అందిస్తుంది. ఈ మార్పులు చాలా సూక్ష్మంగా మొదలవుతాయి. అయితే కాలక్రమేణా పెద్ద ప్రభావం చూపుతాయి. ఆల్ఫాఎర్త్ వాటిని ముందుగానే గుర్తించి హెచ్చరిస్తుంది.

వ్యవసాయానికి ఉపయోగం : వ్యవసాయ రంగంలో కూడా ఇది అమూల్యమైన సహాయకుడుగా పనిచేస్తుంది. ఆల్ఫాఎర్త్ నేల తేమ, పంటల ఆరోగ్యం, నీటి సరఫరా వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది. రైతులు ఎప్పుడు పొలం దున్ని విత్తనాలు వేయాలి, వేసిన తరువాత పంటకు ఎంత నీరు పెట్టాలి, ఎప్పుడు కోత కోయాలి అనే విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఇది సహాయం చేస్తుంది. వాతావరణ మార్పులు పెరిగిపోతున్న సమయంలో, ఆహార భద్రతకు ఇది ఒక ముఖ్యమైన సాధనం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
విపత్తు నిర్వహణలో ఆల్ఫాఎర్త్ : అత్యంత కీలకంగా ఉన్న ఈ AI విపత్తు నిర్వహణలో పెద్ద మార్పు తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వరదలు ఎక్కడ వస్తాయి?, ఏ పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది?, అడవి మంటలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయి అనే అంశాలను క్లుప్తంగా పరిశోధించి సరైన సమాచారాన్ని ఇది అందిస్తుంది. ఈ ప్రశ్నలకు ముందుగానే సమాధానం ఇస్తూ అందర్నీ అలర్ట్ చేస్తుంది. భూభాగం, వాతావరణ డేటాను కలిపి విశ్లేషించి.. రాబోయే ప్రమాదాలపై ప్రపంచానికి హెచ్చరికలు అందిస్తుంది. దీంతో ప్రభుత్వాలు, NGOలు, రక్షణ బృందాలు ముందుగానే సిద్ధం కావచ్చు.

ఇది ఎలా పనిచేస్తుంది?: ఆల్ఫాఎర్త్ మోడల్‌కు లక్షలాది ఉపగ్రహ చిత్రాలు, వాతావరణ రికార్డులు, భూసర్వే మ్యాపులు, చారిత్రక డేటాతో శిక్షణ ఇచ్చారు. ఇది ఒక ప్రాంతంలో జరిగిన మార్పులు ఏ ఫలితాలు ఇస్తాయో నేర్చుకుంది.కొత్త ఉపగ్రహాలు అవసరం లేకుండానే, ఇప్పటికే ఉన్న డేటాను మరింత తెలివైనదిగా మార్చడంలో చాలా బాగా ఉపయోగపడుతోంది. ఈ సిస్టమ్ వ్యక్తిగత లేదా నివాస ప్రాంతాలను గమనించదు. ఇది కేవలం సహజ వనరులు, పర్యావరణ మార్పులు మీదే దృష్టి పెడుతుంది. కాబట్టి ఇది నిఘాకు కాదు, పర్యావరణ రక్షణకు మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
ఇది ఎందుకు ముఖ్యమైంది? ప్రపంచం ఇప్పుడు వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం తగ్గిపోవడం, వేగంగా పెరుగుతున్న నగరాల సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ సందర్భంలో ఆల్ఫాఎర్త్ ఒక గ్లోబల్ పర్యావరణ జ్ఞాన వేదికగా మారనుంది. ప్రభుత్వాలు, సంస్థలు తమ స్థిరత్వ లక్ష్యాలను చేరుకోవడానికి దీనిని చాలా ఈజీగా వినియోగించవచ్చు.క్లుప్తంగా చెప్పాలంటే.. ఆల్ఫాఎర్త్ కేవలం మ్యాప్ కాదు. ఇది భూమి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందుగానే చూపించే పోర్టల్. పర్యావరణ మార్పులను ముందుగా గుర్తించడం ద్వారా మనం రాబోయే విపత్తులకు సిద్ధం కావడానికి ఇది ఒక గేమ్‌చేంజర్ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications