రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గుడ్‌న్యూస్. 2020 క్యాలెండర్ ఏడాది 3వ క్వార్టర్‌లో భారత రెసిడెన్షియల్ మార్కెట్ కాస్త పుంజుకుంది. క్వార్టర్ ప్రాతిపదికన రెండో క్వార్టర్‌తో పోలిస్తే మూడో క్వార్టర్ జూలై-సెప్టెంబర్ మధ్య 34 శాతం పెరిగాయి. ఈ మేరకు జేఎల్ఎల్ రీసెర్చ్ ద్వారా వెల్లడైంది. మంబైలో 29 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్‌లో 22 శాతం ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, పుణే వంటి నగరాల్లో కూడా డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. క్వార్టర్ ప్రాతిపదికన సేల్స్ పెరిగినప్పటికీ, 2019 సంవత్సరంతో పోలిస్తే మాత్రం భారీగానే క్షీణించింది.

ఏడాది ప్రాతిపదికన 61 శాతం డౌన్
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో హౌసింగ్ సేల్స్ గత ఏడాది ఇదే క్వార్టర్‌తో (జూలై-సెప్టెంబర్) పోలిస్తే 61శాతం క్షీణించి 14,415 యూనిట్లు సేల్ అయినట్లు కన్సల్టింగ్ కంపెనీ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. గత ఏడాది ఈ సమయంలో ఇళ్ల అమ్మకాలు 36,826 యూనిట్లుగా ఉంది. క్వార్టర్ పరంగా మాత్రం 34 శాతం వృద్ధిని నమోదు చేసింది. కరోనా సంక్షోభం తీవ్రత, లాక్ డౌన్ ప్రభావంతో ఈ ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో హౌసింగ్ సేల్స్ 10,753 యూనిట్లకు పడిపోయాయి. ఏడు ప్రధాన నగరాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణే, కోల్‌కతా ఉన్నాయి.

కొనుగోలుకు రాబోయే 12 నెలలు అనువైనది
ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో సేల్స్ పైన ఆశాజనకంగా ఉన్నట్లు జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. మోర్టగేజ్ వడ్డీ రేట్లు తగ్గుదల, డెవలపర్ల ఆకర్షణీయమైన ధరలు వంటి అంశాలు జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో హౌసింగ్ సేల్ మార్కెట్ పుంజుకోవడానికి దోహదపడినట్లు తెలిపింది. తక్కువ వడ్డీ రేట్లు, ధరలు తగ్గడం వంటి వివిధ అంశాల నేపథ్యంలో రాబోయే 12 నెలల కాలం కూడా ఇల్లు కొనడానికి అనువైనదిగా జేఎల్ఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కంట్రీ హెడ్ రమేష్ నాయర్ చెప్పారు. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో సేల్స్ వినియోగదారుల విశ్వాసం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయని తెలిపారు.

పండుగలు, ఆఫర్లతో పెరగవచ్చు
ఈ క్యాలెండర్ ఇయర్ మూడో క్వార్టర్‌లో ప్రధానంగా ఎన్నారైల కారణంగా రెసిడెన్షియల్ మార్కెట్ యాక్టివిటీస్‌కు మద్దతు ఉందని నివేదిక తెలిపింది. లాక్ డౌన్ కారణంగా అంతకుముందు క్వార్టర్‌లో అమ్మకాలు తగ్గాయి. ఈ క్వార్టర్‌లో పెరిగాయి. పండుగలు, ఆఫర్లు వంటి వివిధ కారణాలతో వచ్చే క్వార్టర్‌లో (చివరి క్వార్టర్) మరింతగా ఊపందుకోవచ్చునని భావిస్తున్నారు.
రెండో క్వార్టర్‌తో పోలిస్తే మూడో క్వార్టర్‌లో.. చెన్నైలో 241 శాతం, ఢిల్లీలో 38 శాతం, హైదరాబాద్‌లో 76 శాతం (1,207 యూనిట్ల నుండి 2,122 యూనిట్లకు పెరిగాయి), ముంబైలో 17 శాతం, పుణేలో 58 శాతం పెరిగాయి. ఒక బెంగళూరులో మాత్రమే 12 శాతం తగ్గాయి.

ధరలు గణనీయంగా తగ్గకపోవచ్చు
ఏడు ప్రధాన నగరాల్లో అన్‌సోల్డ్ ఇన్వెంటరీస్ 459,378 నుండి 457,427 యూనిట్లకు క్షీణించాయి. ఇందులో, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్ వాటానే 50 శాతానికి పైగా ఉంది. గత కొద్ది నెలలుగా రియాల్టీ మార్కెట్లో ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల కరోనా కారణంగా భారీగా తగ్గాయి. హౌసింగ్ యూనిట్స్ ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంటుందా అంటే లేదనే అంటున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే ధరలు క్షీణించాయని, ఇప్పటికే డెవలపర్లు తక్కువ మార్జిన్‌తో ఇస్తున్నారని, కాబట్టి ధరలు గణనీయంగా తగ్గే అవకాశాలు లేవని అంటున్నారు. మొత్తానికి రియాల్టీ మార్కెట్లో ధరలు తగ్గాయని, దీంతో సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయని అంటున్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications