2021 క్యాలెండర్ ఏడాదిలో హౌసింగ్ సేల్స్ 2020 కంటే మంచి వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని, అయితే కరోనా ముందుస్థాయి 2019 కంటే మాత్రం హౌసింగ్ సేల్స్ తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని టాప్ 7 నగరాల్లో హౌసింగ్ సేల్స్ 2020 క్యాలెండర్ ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం పెరగవచ్చునని, అలాగే కొత్త లాంచింగ్స్ 35 శాతం పెరగవచ్చునని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ పేర్కొంది. 2019తో పోలిస్తే సరఫరా, సేల్స్ కూడా వరుసగా 28 శాతం, 31 శాతం తగ్గవచ్చునని ఈ రీసెర్చ్ వెల్లడించింది.
2021లో హౌసింగ్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన ముప్పై శాతం పెరిగి 1,79,527 యూనిట్లకు చేరుకునే అవకాశముందని తెలిపింది. గత ఏడాది ఈ సంఖ్య 1,38,344గా ఉండగా, 2019లో 2,61,358గా ఉంది. ఢిల్లీ-NCR, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(MMR), పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా... ఈ ఏడు నగరాలను హౌసింగ్ సేల్స్‌కు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ నగరాల్లో హౌసింగ్ సేల్స్ 2023 నాటికి మంచి వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేసింది. 2023 నాటికి హౌసింగ్ సేల్స్ 3.17 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చునని, కొత్త లాంచింగ్స్ 2.62 లక్షలుగా ఉండవచ్చునని పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో 2023 నాటికి హౌసింగ్ సేల్స్ 2019ని మించిపోతాయని అంచనా వేస్తోంది.

నగరం ప్రాతిపదికన చూస్తే ముంబై, బెంగళూరు నగరాల్లో 2023 నాటికి కొత్త లాంచింగ్స్ వేగంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇందులో కేవలం ముంబైలోనే 2023 నాటికి హౌసింగ్ సేల్స్ పెరుగుదల మొత్తం సేల్స్‌లో (ఏడు నగరాలు) 30 శాతం, ఉండవచ్చునని, కొత్త లాంచింగ్స్ కూడా మొత్తం ఏడు నగరాల్లోని వాటాలో ముంబై వాటా 28 శాతంగా ఉండవచ్చునని తెలిపింది. బెంగళూరు హోమ్ సేల్స్ వాటా 20 శాతం, కొత్త లాంచింగ్స్ వాటా 17 శాతం, ఢిల్లీ హోమ్ సేల్స్ వాటా 18 శాతం, కొత్త లాంచింగ్స్ వాటా 15 శాతం, పుణే హోమ్ సేల్స్ వాటా 15 శాతం, కొత్త లాంచింగ్స్ 18 శాతంగా ఉండవచ్చునని తెలిపింది. కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ నగరాల కొత్త లాంచింగ్స్ వాటా ఆరు శాతం నుండి ఎనిమిది శాతం ఉండవచ్చునని తెలిపింది.
2017 నుండి రెసిడెన్షియల్ రంగం మంచి వృద్ధిని కనబరుస్తోందని తెలిపింది. 2019 నాటికి మంచి స్థాయికి చేరుకుందని, 2020 నుండి కరోనా ప్రభావం పడిందని పేర్కొంది. 2020 రెండో అర్ధ సంవత్సరం నుండి పుంజుకోవడం ప్రారంభమైందని, దీంతో గత ఏడాది కొత్త లాంచింగ్స్ 1.28 లక్షలకు, సేల్స్ 1.38 లక్షలకు పడిపోయినట్లు తెలిపింది. అనరాక్ డేటా ప్రకారం 2014లో హౌసింగ్ సేల్స్ 3,42,980, 2015లో 3,08,250, 2016లో 2,39,260, 2017లో 2,11,143, 2018లో 2,48,311 సేల్స్ నమోదయ్యాయి.
More From GoodReturns

HDFC బ్యాంక్ బంపర్ ఆఫర్.. లోన్ ఉన్నవారికి ఊరట.. నేటి నుండే కొత్త రేట్లు అమలు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications