Real Estate: ప్రస్తుతం దేశంలోని కీలక మెట్రో నగరాల్లో రియల్టీ బూమ్ తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 8 పట్టణాల్లో సగటున 5 శాతం మేర విక్రయాలు తగ్గాయి. ఎనిమిది పట్టణాల్లో 96,544 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు ప్రాప్‌టైగర్ 'రియల్ ఇన్‌సైట్స్' నివేదిక ద్వారా వెల్లడైంది. అయితే క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు లక్ష యూనిట్లకు పైగానే నమోదయ్యాయి.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అమ్మకాలతో పాటు కొత్త ప్రాజెక్టుల లాంచ్ భారీగా క్షీణించాయని తాజా నివేదికల ప్రకారం వెల్లడైంది. వాస్తవానికి రెండవ త్రైమాసిక సమయంలో హైదరాబాద్‌లో కొత్త లాంచ్‌లు 54% క్షీణించాయని డేటా అనలిటిక్స్ సంస్థ PropEquity వెల్లడించింది. ఈ క్రమంలో నగరంలో ఇళ్ల అమ్మకాలు 42% తగ్గాయని నివేదించింది. వాస్తవానికి దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇది అత్యధిక క్షీణతగా చెప్పుకోవచ్చు. గత ఏడాది ఇదే త్రైమాసిక సమయంలో హైదరాబాదులో 25,370 కొత్త హౌసింగ్ లాంచ్‌లు నమోదు కాగా.. ఈ ఏడాది ఇవి 11,601కి తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇదే క్రమంలో అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో గత ఏడాది 20,658 యూనిట్లు విక్రయించగా.. ప్రస్తుత సంవత్సరం ఇదే కాలంలో అమ్మకాలు 12,082 యూనిట్లకు పడిపోయింది. ఈ పరిస్థితులకు అధిక సరఫరా, పెరిగిన ధరలతో పాటు వేగంగా నగరంలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలే కారణాలుగా రియల్టీ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా విపరీతంగా పెరిగిన కొత్త యూనిట్ల సరఫరా.. వ్యాపారం మందగమనానికి దారితీసిందని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్, ప్రెసిడెంట్ జీవీ రావు వెల్లడించారు. అలాగే హైదరాబాదులో ప్రస్తుతం ఇళ్ల ధరలు అకస్మాత్తుగా పెరిగాయని ఆయన చెప్పారు. నగరం పశ్చిమ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ.10,000 ఖర్చవుతుండగా ఈ ధరలు చాలా మంది బడ్జెట్ కంటే అధికమని ఆయన వెల్లడించారు.
ఇదే క్రమంలో అమ్మకాలు పడిపోవటానికి మరో కీలక నిర్ణయం జూన్-ఆగస్టు మధ్యలో కొత్త ఇళ్ల కొనుగోళ్లు ప్రజలు అశుభకరంగా భావిస్తారని హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు, రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఇది రిజిస్ట్రేషన్‌లలో క్షీణతకు దారితీసిందన్నారు. ఈ సమయంలో చాలా మంది తమ పిల్లల భవిష్యత్తు విద్యకు ఎక్కువగా డబ్బును వెచ్చిస్తుంటారు. అందుకే ఇంటి కొనుగోలు నిర్ణయాలను ఈ నెలల్లో వాయిదా వేస్తుంటారు. అయితే అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో తిరిగి అమ్మకాలు పుంజుకుంటాయని రాజశేఖర్ రెడ్డి అన్నారు. పండుగల సీజన్ ప్రారంభంమైన వేళ కొనుగోలుదారులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
వీటికి తోడు ప్రధానంగా చాలా మంది హైదరాబాదు నగరంలో ఇళ్ల కొనుగోళ్లకు దూరంగా ఉండటానికి అసలు కారణం హైడ్రా కూల్చివేతలు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైడ్రాకు మరిన్ని పవర్స్, నిధులు, మ్యాన్ పవర్ అందించటంతో చెరువుల ఆక్రమణలను తొలగింపు మరింత వేగవంతం అయ్యింది. జూన్ నుంచి ఇవి మెుదలైన వేళ హైదరాబాద్ రియల్టీ భారీ క్షీణతను చూస్తోంది. ఇప్పటికే ప్రాపర్టీలు కొన్న వ్యక్తులు ఆందోళన చెందుతుండగా.. కొత్త కొనుగోలుదారులు సైతం మరింత జాగ్రత్తగా ముందుకు సాగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రిస్క్ వద్దనుకుంటున్న అనేక మంది ఇన్వెస్టర్లు హైదరాబాద్ రియల్టీ ఆస్తుల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న ప్రాపర్టీలకు డిమాండ్ లేకపోవటంతో కొత్త ప్రాపర్టీల నిర్మాణ లాంచ్ లు తగ్గుముఖం పట్టాయని క్రెడాయ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, క్రెడాయ్ తెలంగాణ మాజీ ఛైర్మన్ రామచంద్రారెడ్డి చెబుతున్నారు.
More From GoodReturns

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

బెంగళూరు అద్దెలు షాకింగ్: సామాన్యుల పరిస్థితి ఏంటి?

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బెంగళూరు సబర్బన్ రైలు ఆగిందా? ఐటీ ఉద్యోగులకు షాకింగ్ వార్త

Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!

అమరావతి రియల్ ఎస్టేట్: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయా?

అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?

బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టుకు మళ్లీ భారీ షాక్!

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications