కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైంది. దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గత ఏడాది జనవరి - మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 26 శాతం తగ్గాయి. జనవరి - మార్చి క్వార్టర్‌లోనే కొత్త యూనిట్ల ప్రారంభం 51 శాతం తగ్గింది. ఈ మేరకు బ్రోకరేజీ సంస్థ ప్రోప్‌టైగర్ డాట్ కామ్ వెల్లడించింది.

భారీగా పడిపోయిన ఇళ్ల ప్రాజెక్టుల ప్రారంభం
ఈ ఏడాది 69,235 యూనిట్ల ఇళ్లు సేల్ అయ్యాయి. అంతకుముందు ఏడాది ఇది 93,936గా ఉంది. జనవరి - మార్చి క్వార్టర్‌లో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణే, నోయిడా నగరాల్లో 35,668 యూనిట్లు లాంచ్ అయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో 72,932 యూనిట్లు లాంచ్ చేశారు.

హైదరాబాద్‌లోనే అత్యంత ధరల పెరుగుదల
క్వార్టర్ పరంగా చూస్తే అంతకుముందు త్రైమాసికం కంటే 11 శాతం హౌసింగ్ సేల్స్ పడిపోయాయి. కొత్త ప్రారంభాలు 27 శాతం తగ్గాయి. అయితే ధరలు మాత్రం ఆ స్థాయిలో తగ్గలేదు. గత ఏడాది జనవరి - మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈసారి గురుగ్రామ్‌లో ధరలు 1 శాతం తగ్గాయి. మిగతా చోట్ల పెరిగాయి. హైదరాబాద్‌లో ఎక్కువగా 9 శాతం పెరిగాయి. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో 6 శాతం పెరిగాయి. చెన్నై వంటి నగరాల్లో మార్పు లేదు. మిగతా నగరాల్లో 1 శాతం నుండి 4 శాతం మధ్య పెరిగాయి.

ఏ నగరంలో ఎంత క్షీణించిందంటే?
ఇళ్ల అమ్మకాలకు మార్చి అత్యంత అనుకూల సమయమని ప్రోప్ టైగర్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయన్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై కాకుండా అన్ని రంగాలపై ప్రభావం పడిందన్నారు.
హైదరాబాద్‌లో 5,554 విక్రయాలు జరగ్గా, 39 శాతం తగ్గాయి.
బెంగళూరులో 8,197 విక్రయాలు జరగ్గా, 24 శాతం తగ్గాయి.
చెన్నైలో 3,643 విక్రయాలు జరగ్గా, 23 శాతం తగ్గాయి.
ముంబైలో 23,969 విక్రయాలు జరగ్గా, 14 శాతం తగ్గాయి.
పుణేలో 15,523 విక్రయాలు జరగ్గా, 15 శాతం తగ్గాయి.
గురుగ్రామ్‌లో 1,901 విక్రయాలు జరగ్గా, 73 శాతం తగ్గాయి.
నోయిడాలో 3,152 విక్రయాలు జరగ్గా, 26 శాతం తగ్గాయి.
అహ్మదాబాద్‌లో 4,549 విక్రయాలు జరగ్గా, 26 శాతం తగ్గాయి.
కోల్‌కతాలో 2,747 విక్రయాలు జరగ్గా, 41 శాతం తగ్గాయి.

ఉద్దీపనలతో పుంజుకోవచ్చు
నెలల వారీగా చూస్తే మార్చిలో లాక్ డౌన్ కారణంగా ఇళ్ల సేల్స్ భారీగా పడిపోయాయి. జనవరి నెలలో 26,126 ఇళ్లు అమ్ముడవగా, మార్చిలో 19,122 సేల్ అయ్యాయి. ఈ క్వార్టర్‌లోను అమ్మకాల్లో క్షీణత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం, ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపనల కారణంగా వచ్చే నెల నుండి పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ధరలు కూడా 10 శాతం నుండి 20 శాతం తగ్గవచ్చునని గతంలోనే కొన్ని సంస్థలు అంచనా వేశాయి. లాక్ డౌన్ తర్వాత ఆరు నెలల పాటు తగ్గుదల ఉండవచ్చునని చెబుతున్నారు.

లాక్ డౌన్ తర్వాత మార్పులు
లాక్ డౌన్ నేపథ్యంలో కస్టమర్ల వ్యవహార శైలిలో మార్పులు చోటు చేసుకోవచ్చునని ధ్రువ్ అగర్వాల్ అన్నారు. ఆన్ లైన్ ద్వారానే ఇళ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం, ఆన్ లైన్ బుకింగ్స్ పద్ధతి క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొబైల్ తయారీ సంస్థలు కొత్త ఉత్పత్తులు మొదట ఆన్ లైన్లోనే ప్రారంభిస్తారని, రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్‌లోను ఆ దిశగా ఊపందుకోవచ్చునని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications