భారత్‌లోని 8 ప్రధాన నగరాల్లో 2019 ఇదే కాలంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 70శాతం, హౌసింగ్ సేల్స్ 43శాతం క్షీణించాయి. గురువారం నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ రంగం భారీగా క్షీణించినట్లు తెలిపింది. అయితే ఏప్రిల్-జూన్ క్వార్టర్‌తో పోలిస్తే మాత్రం హౌసింగ్ సేల్స్ మూడు రెట్లు పెరగగా, ఆఫీస్ స్పీస్ లీజింగ్ 81 శాతం వృద్ధి సాధించింది. కరోనా, లాక్ డౌన్ కారణంగా మొదటి క్వార్టర్‌లో సేల్స్ భారీగా పడిపోయాయి. ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకోవడంతో క్రమంగా పుంజుకుంటున్నాయి.

హౌసింగ్ సేల్స్, ఆఫీస్ లీజ్ డౌన్.. కానీ
జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో సేల్స్ కాస్త ప్రోత్సాహకరంగా ఉన్నాయని, కానీ పూర్తిగా కోలుకోలేదని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో పుంజుకోవడం కోవడం కనిపించిందని, కమర్షియల్ లీజింగ్ ఆశాజనకంగా ఉందని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి 2019 స్థాయికి తిరిగి కోలుకుంటుందని బైజల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
డేటా ప్రకారం హౌసింగ్ సేల్స్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 43 శాతం క్షీణించి 58,183 (2019-20) యూనిట్ల నుండి ఇప్పుడు 33,403కు క్షీణించాయి. 8 ముఖ్య నగరాల్లో గ్రాస్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 15.7 మిలియన్ చదరపు అడుగుల నుండి 4.7 మిలియన్ చదరపు అడుగులకు క్షీణించింది.

నగరాలవారీగా చూస్తే..
నగరాల వారీగా హౌసింగ్ సేల్స్ ఇలా ఉన్నాయి... ముంబైలో గత ఏడాది 14,733 యూనిట్లు సేల్ కాగా, ఈసారి 7,635 యూనిట్లకు క్షీణించింది. ఆఫీస్ స్పేస్ లీజింగ్ గత ఏడాది 2.7 మిలియన్ చదరపు అడుగులు కాగా, ఈసారి 1 మిలియన్ చదరపు మిలియన్ అడుగులకు పరిమితమైంది.
ఢిల్లీ-ఎన్సీఆర్‌లో రెసిడెన్షియల్ సేల్స్ 12,000 యూనిట్ల నుండి 6,147కు పడిపోగా, ఆఫీస్ స్పేస్ లీజింగ్ 1.8 మిలియన్ చదరపు అడుగుల నుండి 0.9 మిలియన్ చదరపు అడుగులకు క్షీణించింది.
పుణేలో హౌసింగ్ సేల్స్ 7,648 యూనిట్ల నుండి 4,918 యూనిట్లకు పడిపోయాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ 1.3 మిలియన్ చదరపు అడుగుల నుండి 0.2 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది.
అహ్మదాబాద్‌లో హౌసింగ్ సేల్స్ 2,553 యూనిట్ల నుండి 1,176కు పడిపోగా, ఆఫీస్ లీజింగ్ 0
5 మిలియన్ చదరపు అడుగుల నుండి 0.1 మిలియన్ చదరపు అడుగులకు క్షీణించింది.
కోల్‌కతాలో మాత్రం హౌసింగ్ సేల్స్ 3,041 నుండి 3,921కి పెరిగాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ మాత్రం 0.7 మిలియన్ చదరపు అడుగుల నుండి 0.2 మిలియన్ చదరపు అడుగులకు క్షీణించింది.

హైదరాబాద్ సహా దక్షిణాదిన సేల్స్
బెంగళూరులో 2019లో హౌసింగ్ సేల్స్ 9,023 యూనిట్లు కాగా, ఈసారి 4,912కు పడిపోయాయి. ఆఫీస్ లీజింగ్ 3 మిలియన్ చదరపు అడుగుల నుండి 1.1 మిలియన్ చదరపు అడుగులకు క్షీణించింది.
చెన్నైలో హౌసింగ్ సేల్స్ 4,389 యూనిట్ల నుండి 3,085 యూనిట్లకు పడిపోగా, ఆఫీస్ స్పేస్ లీజింగ్ 3.2 మిలియన్ చదరపు అఢుగుల నుండి 0.7 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.
హైదరాబాద్‌లో హౌసింగ్ సేల్స్ 4,760 యూనిట్ల నుండి 1,609 యూనిట్లకు క్షీణించాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ 3.7 మిలియన్ల నుండి ఏకంగా 0.5 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.

ధరలు ఎలా ఉన్నాయంటే..
ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే అద్దెకు తీసుకున్న కార్యాలయ స్థలం ఆశాజనకంగా లేకున్నప్పటికీ బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ అద్దెలు వరుసగా 4 శాతం, 2 శాతం చొప్పున పెరిగాయి. మిగతా నగరాల్లో అద్దెలు యథాతథంగా లేదా తగ్గాయి.
ఏడాది క్రితంతో పోలిస్తే జులై-సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్‌లో వెయిటెడ్ సగటు ప్రాతిపదికన ఇళ్ల ధరలు 4 శాతం పెరిగాయి. బెంగళూరులో 3 శాతం పెరిగాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో హైదరాబాద్, బెంగళూరు మినహా కోల్‌కతా, చెన్నై, పుణె, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్... 6 నగరాల్లో ఇళ్ల ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇళ్లు 2019 ఇదే క్వార్టర్‌లో 3,374 గృహాలు కాగా, ఈసారి 1,234 ఇళ్లు మాత్రమే ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications