Real Estate: దేశంలోనే హైదరాబాద్ రియల్టీ మార్కెట్ ఒకప్పుడు పెద్ద బూమ్ చూసింది. నగరంలోని కోకాపేట్ ప్రాంతంలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో రూ.100 కోట్లు పలికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలనే కాకుండా దేశంలోని చాలా మందిని షాక్ కి గురిచేసింది. వాస్తవానికి నగరానికి విపరీతంగా పెరిగిన పెట్టుబడులు, క్యూ కట్టిన ప్రాజెక్టులు రద్దీని పెంచేసింది. ఈ క్రమంలో సొంతిల్లు కొనుక్కునేందుకు బ్యాంక్ లోన్స్ రావటంతో చాలా మంచి డిమాండ్ కనిపించింది.
అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత కొంత రియల్టీ బూమ్ తగ్గిందని చాలా మంది చెబుతున్నారు. దేశంలోని టాప్ నగరాల్లో కూడా రియల్టీ బూమ్ తగ్గినట్లు డేటా చెబుతోంది. ఏడాది ప్రాతిపదికన జూన్-సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో తగ్గిన ఇళ్ల అమ్మకాలను పరిశీలిస్తే.. హైదరాబాదులో అమ్మకాలు ఏకంగా 42 శాతం పడిపోయాయి. దీని తర్వాత బెంగళూరులో 26 శాతం, కలకత్తాలో 23 శాతం, పూణేలో 19 శాతం, చెన్నైలో 18 శాతం, ముంబైలో 17 శాతం, థానేలో 10 శాతం ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. దేశంలోని అగ్రగామి నగరాల్లో హౌసింగ్ మార్కెట్ ప్రస్తుతం పెద్ద మందగమనాన్ని చూస్తోంది.

హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే ఈ పరిస్థితులు మరికొన్ని నెలలు కొనసాగవచ్చని రియల్టర్లు భావిస్తున్నారు. మార్కెట్లో స్తబ్థత, దిద్దుబాటు కొనసాగుతున్నప్పటికీ చాలా కొత్త ప్రాజెక్ట్‌లు రాబోతున్నాయి. ఇవి 2025-26లో చాలా యూనిట్లు మార్కెట్‌కి అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. సామాన్యులు ఊహలకు సైతం అందని స్థాయిల్లో ప్రాపర్టీల రేట్లు పెంచటంతో పాటు సమంజసం కాని బిల్డర్ల ఎక్స్‌పెక్టేషన్స్ వంటి సమస్యలు మార్కెట్లలో కొనుగోలుదారులకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తున్నాయి. రాబోయే కొద్ది నెలల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత దిగజారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిమాండ్ తగ్గుదల 2025 చివరి వరకు కొనసాగవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో అద్భుతమైన డీల్‌ల కోసం కొనుగోలుదారులు మరో 6-8 నెలలు వేచి ఉండాల్సి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫాన్సీ, ఆకర్షణీయమైన ప్రకటనలతో మోసపోకుండా సరైన ప్రాపర్టీ కొనుగోలు కోసం డబ్బును రెడీగా ఉంచుకోవటం ఉత్తమ మార్గంగా చాలా మంది సూచిస్తున్నారు.

మార్కెట్లో హైడ్రా టెన్షన్స్..
ప్రస్తుతం హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి, అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారిని వెంటాడుతున్న ఆందోళన హైడ్రా. అవును రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువుల ఆక్రమణను హైడ్రాను రంగంలోకి దించి ఉక్కుపాదం మోపుతోంది. ఆక్రమణదారులకు కనీసం కోర్టుకు వెళ్లేందుకు కూడా సమయం ఇవ్వకుండా శరవేగంగా కూల్చివేతలు చేపడుతోంది. ఇది చాలా మంది బిల్డర్లను, ఇళ్ల కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ చర్యలు కొనుగోలుదారులను అప్రమత్తం చేస్తున్నాయి. హైడ్రా యాక్షన్ తో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications