దేశంలో రియల్ ఎస్టేట్ మందగమనంలో నడుస్తోంది. 2025 మొదటి ఆరు నెలల కాలంలో భారతదేశంలోని మెట్రో నగరాల్లో గృహ యూనిట్ విక్రయాలు తగ్గినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక పేర్కొంది. ఇండియా రియల్ ఎస్టేట్.. ఆఫీస్ & రెసిడెన్షియల్ మార్కెట్ - H1 2025 అనే ఈ నివేదిక భారతదేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది ప్రధాన నగరాల్లో నివాస మార్కెట్ పరిస్థితిని విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం చూసుకుంటే.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 47,035 ఇళ్లు అమ్ముడయ్యాయి.ఇది గత ఏడాది నుంచీ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగింది. అయితే కొత్త నిర్మాణాలు మాత్రం 3 శాతం తగ్గి 45,451 ఇళ్లకు పరిమితమయ్యాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో గృహ విక్రయాలు ఎనిమిది శాతం తగ్గి 26,795 యూనిట్లకు చేరుకున్నాయి. కొత్త ప్రారంభ గృహాలు 17 శాతం తగ్గి 25,233 యూనిట్లయ్యాయి. సిలికాన్ సిటీ బెంగళూరులో 3శాతం తగ్గుదలతో 26,599 గృహాలు అమ్ముడయ్యాయి. అయితే ఇక్కడ లాంచ్‌లు మాత్రం 31 శాతం పెరిగి 33,498 యూనిట్లకు చేరాయి. పుణేలో విక్రయాలు 1 శాతం తగ్గి 24,329 యూనిట్లకే పరిమితమయ్యాయి. కొత్త గృహాల లాంచ్‌లు కూడా 5 శాతం తగ్గి 26,559 యూనిట్లయ్యాయి.

ఇక హైదరాబాద్, చెన్నై మాత్రం కాస్త వృద్ధిని నమోదు చేసాయి. హైదరాబాద్‌లో 3 శాతం వృద్ధితో 19,048 యూనిట్లు అమ్ముడయ్యాయి. కొత్త లాంచ్‌లు మాత్రం 6% తగ్గి 20,962 యూనిట్లుగా నమోదయ్యాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో గృహ విక్రయాలు 12 శాతం పెరిగి 8,935 యూనిట్లకు చేరాయి. కొత్త లాంచ్‌లు 9 శాతం పెరిగి 9,621 యూనిట్లుగా నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో విక్రయాలు స్థిరంగా 9,370 యూనిట్లుగా కొనసాగాయి. కొత్త లాంచ్‌లు మాత్రం 5% పెరిగి 10,734 యూనిట్లు అయ్యాయి. కోల్‌కతాలో గృహ విక్రయాలు 11 శాతం పడిపోయి 8,090 యూనిట్లకు తగ్గిపోయాయి. కొత్త లాంచ్‌లు భారీగా 29 శాతం తగ్గి 7,682 యూనిట్లకే పరిమితమయ్యాయి.
మొత్తంగా ఎనిమిది నగరాల్లో 1,70,201 గృహ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాదితో పోల్చితే 2% తగ్గుదల. కొత్త లాంచ్‌లు కూడా 2% తగ్గి 1,79,740 యూనిట్లయ్యాయి. ఒకవైపు రూ. 1 కోటి పైగా ఉన్న గృహాల విక్రయాలు 17 శాతం పెరిగాయి. రూ. 2-5 కోట్ల గృహాల విక్రయాలు ఏకంగా 29 శాతం వృద్ధిని చూపించాయి. కోర్టర్స్ టు సెల్ రేషియో 5.8 వద్ద స్థిరంగా ఉండడం మార్కెట్ స్థిరత్వాన్ని సూచిస్తోంది. గృహ మార్కెట్‌లో ఆసక్తి కొనసాగుతున్నప్పటికీ, విక్రయాల్లో మాత్రం ఊపుతగ్గింది. అయితే ఇదే సమయంలో అధిక విలువ గల గృహాల డిమాండ్ పెరుగుతున్నదని నివేదిక స్పష్టం చేసింది. డెవలపర్లు భవిష్యత్తు డిమాండ్‌పై ధైర్యంగా ఉన్నారని నివేదిక పేర్కొంది.
More From GoodReturns

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బెంగళూరు నుండి 2 వేల స్సెషల్ బస్సులు.. ఉగాది నాడు ప్రయాణికులకు KSRTC గుడ్ న్యూస్..

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

Bengaluru: ఆపదలో పుట్టిన ఆలోచన! గ్యాస్ సమస్యకి సామాన్యుడి అద్భుత పరిష్కారం..!

Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు



Click it and Unblock the Notifications