For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల హోమ్ లోన్స్ వృద్ధి 10 శాతం వరకు

|

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల(HFCs) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం నుండి 10 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఇక్రా అధ్యయనంలో వెల్లడైంది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, ఇళ్లకు డిమాండ్ పెరగడంతో వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. జూన్ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన వృద్ధి నమోదు కాలేదని, కరోనా కారణంగా లోన్ బుక్ ప్రభావితమై, రుణ పంపిణీ, వసూళ్ల సామర్థ్యం రెండు కూడా తగ్గినట్లు ఈ నివేదిక తెలిపింది. 2021 జూన్ చివరి నుండి వసూళ్ల సామర్థ్యం పెరిగిందని, సెప్టెంబర్ త్రైమాసికంలో మరింత పుంజుకుందని తెలిపింది. పరిశ్రమలో ఆరోగ్యకర డిమాండ్ ఉండటం, ఆర్థిక కార్యలాపాల స్థాయి పెరగడం, వ్యాక్సీన్ కార్యక్రమం ఊహించినట్లుగా జరగడంతో రుణ పంపిణీలో స్థిర వృద్ధి, వసూళ్లలో మెరుగుదల కనిపిస్తోందని తెలిపింది.

దేశంలో HFCs ఆన్-బుక్ పోర్ట్‌ఫోలియో 2021 జూన్ 30 నాటికి రూ.11 లక్షల కోట్లకు చేరిందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్(ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్స్) సచిన్ సచ్‌దేవా తెలిపారు. ఇందులో గృహ రుణాలు, స్థిరాస్తి తనఖా రుణాలు, నిర్మాణ రుణాలు, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ ఉన్నాయన్నారు.

Housing finance companies to grow at 8-10% in FY22: ICRA

కరోనా ప్రభావంతో 2020-21లో పోర్ట్‌ఫోలియో వృద్ధి 6 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. HFCs నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ జూన్ 30, 2021తో ముగిసే నాటికి 3.6 శాతం పెరిగాయి. మార్చి 31, 2021 నాటికి 2.9 శాతంగా ఉన్నాయి. అంతకుముందు మార్చి 31, 2020 నాటికి ఇది 2.3 శాతంగా ఉంది.

English summary

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల హోమ్ లోన్స్ వృద్ధి 10 శాతం వరకు | Housing finance companies to grow at 8-10% in FY22: ICRA

Housing finance companies (HFCs) are likely to witness a growth of 8-10 per cent in fiscal 2022 helped by rise in economic and higher demand, says a report.
Story first published: Sunday, November 14, 2021, 18:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X