హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ రంగం గత మూడు సంవత్సరాలుగా అపూర్వమైన పెరుగుదలను నమోదు చేస్తోంది. ముఖ్యంగా లగ్జరీ హౌసింగ్ విభాగంలో దూసుకుపోతోంది. ఒకప్పుడు కేవలం అత్యంత ధనిక వర్గానికి మాత్రమే పరిమితమైన ఈ మార్కెట్.. ఇప్పుడు కొత్త డిమాండ్, ప్రీమియం అభిరుచులు, వేగంగా పెరుగుతున్న HNIలు (High Net-worth Individuals), కార్పొరేట్ వృద్ధి కారణంగా శక్తివంతంగా మారింది.
ANAROCK తాజా నివేదిక ప్రకారం గడిచిన మూడు సంవత్సరాల కాలంలో అంటే 2022 నుండి 2025 మధ్య టాప్ 7 నగరాల్లో రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ విలువ గల ఇళ్ల సగటు ధరలు 40% పెరిగాయి.ఢిల్లీ-NCR 72% పెరుగుదలతో దేశంలో ముందంజలో ఉండగా, Hyderabad 41 శాతం జంప్‌తో కీలకమైన వృద్ధి నగరంగా గుర్తింపు పొందింది.నగరంలో 2022లో చదరపు అడుగుకు రూ.14,530గా ఉన్న లగ్జరీ ఇళ్ల సగటు ధరలు ఇప్పుడు రూ.20,300కి చేరాయి.

NCRలో అయితే ఈ ధర 2022లో రూ.13,450 నుండి ఇప్పుడు రూ.23,100కి చేరింది. ధరలు మాత్రమే కాదు, ఈ విభాగంలో అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2025లోని మొదటి తొమ్మిది నెలల్లో టాప్ 7 నగరాల్లో అమ్ముడైన మొత్తం 2.87 లక్షల ఇళ్లలో దాదాపు 30 శాతం లగ్జరీ విభాగానికి చెందినవే కావడం అనేది ప్రస్తుత మార్పును స్పష్టంగా చూపుతుంది.
ఇక హైదరాబాద్ నగరంలో లగ్జరీ ఇళ్ల ధరలు 41 శాతం పెరిగాయి. అయినప్పటికీ దేశంలోని టాప్ నగరాల్లో లగ్జరీ హౌసింగ్‌లో హైదరాబాద్, కోల్‌కతాతో కలిసి అత్యల్ప ప్రస్తుత ధరలతో నిలుస్తోంది.2025 నాటికి చదరపు అడుగుకు రూ.14,200. మధ్య స్థాయి విభాగంలో చదరపు అడుగుకు రూ.8,420, అందుబాటు గృహాలలో రూ.5,235 ఉండటం, ఈ నగరంలో భవిష్యత్ అభివృద్ధికి ఇంకా పెద్ద అవకాశాలను సూచిస్తోంది.
ఈ భారీ పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. IT, ఉద్యోగ అవకాశాల విస్తరణ, మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధి, ORR-AeroCity-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రీమియం ప్రాంతాల విస్తరణ, కార్పొరేట్ హెడ్‌క్వార్టర్లు, గ్లోబల్ బ్యాంకులు, MNCలు, స్టార్టప్‌ల బూమ్ ఇవన్నీ కలిపి హైదరాబాద్ రియాల్టి రంగాని ముందుకు తీసుకెళ్లాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనుజ్ పూరి మాట్లాడుతూ.. ప్రీమియం ప్రదేశాలలో పెద్ద ఇళ్లకు ప్రజలు బాగా ఆకర్షితులవుతున్నారు. పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు, డిమాండ్‌తో ధరల పెరుగుదల సహజమని పేర్కొన్నారు.
ఇతర విభాగాలు ఈ లగ్జరీ బూమ్‌ను అనుసరించాయి. అందుబాటు గృహాల ధరలు 26 శాతం మాత్రమే పెరిగాయి.అలాగే మధ్య & ప్రీమియం విభాగాలు 39 శాతం వృద్ధి చూశాయి. NCRలో మధ్య & ప్రీమియం ఇళ్ల ధరలు 54 శాతం పెరగడం, ఆ నగరంలోని మార్కెట్ యొక్క దూకుడు స్వభావాన్ని చూపిస్తుంది.
హైదరాబాద్‌లో రాబోయే దశాబ్దంలో లగ్జరీ రియల్ ఎస్టేట్ మరింత బలపడుతుందని అంచనా. మరిన్ని గ్లోబల్ కంపెనీల ప్రవేశం, HNI & Ultra-HNI జనాభా పెరుగుదల, మౌలిక సదుపాయాల పెట్టుబడులతో ఈ విభాగం రాబోయే సంవత్సరాలలో అధిక వేగంతో కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications