ఇళ్లలో పని చేస్తూ రూ.60 లక్షల 3BHK అపార్ట్‌మెంట్? ఈ పని మనిషి కథ వింటే ఆశ్చర్యపోతారు!
ఇంట్లో పని చేసేవారి లేకుండా ఒక్క పని కూడా సరిగ్గా పూర్తవడం కష్టం అవుతుంది. ఈ రోజుల్లో చిన్న పెద్ద నగరాలలో వీళ్లు లేకపోతే పనులు మధ్యలో ఆగిపోతాయి. కానీ మెట్రో నగరాల్లో పని మనుషులకి డిమాండ్ ఎక్కువే. ప్రతి ఇంటికి వారి అవసరాల మేరకు ఒక్కొక్క పనికి వాళ్ళు ఉపయోగపడతారు. ఇప్పుడు మీరు ఈ పని మనిషి కథ వింటే నిజంగా షాక్ అవుతారు ఎందుకంటే, ఇంత చిన్న జీతంలో కూడా ఒక పని మనిషి రూ. 60 లక్షల విలువైన 3BHK అపార్ట్‌మెంట్ ని కొనుక్కుంది.
సురత్‌లో రూ. 60 లక్షల విలువైన 3BHK అపార్ట్‌మెంట్ కొన్న పని మనిషి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. ఈ విశేషాన్ని కంటెంట్ క్రియేటర్ నలినీ ఉనగర్ షేర్ చేశారు. ఆమెను చూసినప్పటి నుండి ఈ ఆర్థిక విజయాన్ని తెలుసుకున్న నలినీ ఉనగర్ "షాక్" మరియు "మౌనంగా" అనిపించిందని తెలిపారు.

ఉనగర్ వివరించినట్లే, "ఈ రోజు మా ఇంటి పని మనిషి రోజు వచ్చినట్టే ఇంటికి పనికి వస్తే చాలా సంతోషంగా తను నా దగ్గరకి వచ్చి చెప్పింది. సురత్‌లో రూ. 60 లక్షల విలువైన 3BHK ఫ్లాట్ కొని, ఫర్నిచర్ కోసం రూ. 4 లక్షలు ఖర్చు పెట్టిందని, కేవలం రూ. 10 లక్షల లోన్ మాత్రమే తీసుకున్నట్లు చెప్పారు. నిజంగా నేను అది విని చాలా షాక్ అయ్యాను."
నేను దాని గురించి మరింత తెలుసుకోవడానికి తనని అడిగినపుడు, ఇది ఆమె మొదటి పెట్టుబడి కాదని తెలిసింది. ఆమె ఇప్పటికే వెలంజా గ్రామంలో రెండు అంతస్తుల ఇల్లు మరియు షాప్ కలిగి ఉంది వాటిని అద్దెకు ఇచ్చి అక్కడ నుంచి కుడా ఆదాయం పొందుతోంది. అది వింటే నేను మౌనంగా కూర్చున్నాను," అని ఉనగర్ చెప్పారు.
అందరు ముందుగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇదే ఆమె మొదటి పెట్టుబడి కాదు. వెలంజా గ్రామంలో ఆమెకు ఇప్పటికే రెండు అంతస్తుల ఇల్లు, షాప్ ఉన్నాయి. ఇవి అద్దెకు ఇచ్చి ఆమెకు ప్రతి నెలా అదనంగా ఆదాయం వస్తోంది. ఇలా ఒకే ఆదాయం పై ఆధారపడకుండా వేర్వేరు చోట్ల నుంచి వచ్చే ఆదాయాన్ని కలిపితే మొత్తం ఆదాయం స్థిరంగా, క్రమంగా పెరుగుతుంది. ఒక ఆదాయం తాత్కాలికంగా తగ్గినా, మరో ఆదాయం సహాయం చేస్తుంది. అందుకే చాలా మంది బహుళ ఆదాయ వనరులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ఇది ఆర్థిక భద్రతను పెంచడమే కాకుండా, ఆస్తులను వేగంగా పెంచుకునేందుకు కూడా సహాయపడుతుంది.
భారతదేశంలో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ 2025
ఈ కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక యూజర్లు విభిన్నంగా స్పందించారు. కొందరు ఆమె సేవింగ్స్ పద్ధతిని, క్రమశిక్షణను ప్రశంసించగా మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నా ప్లానింగ్, క్రమంగా సేవ్ చేయడం ద్వారా కూడా ఆర్థికంగా ఎదగవచ్చని చెప్పారు. ఒక యూజర్ మాట్లాడుతూ, "నిరంతర కృషి, క్రమశిక్షణ చాలా ముఖ్యం. చిన్న ప్రయత్నాలు ఎక్కువ కాలం కొనసాగితే పెద్ద ఫలితాలు వస్తాయి. కుటుంబం నుంచి సపోర్ట్ కూడా ఉండొచ్చు. అయినా ఆమె సాధించినది నిజంగా శభాష్" అని అన్నారు.
మరొకరు "సాలరీ జీతం పొందేవారికి పన్నులు ఎక్కువగా ఉంటాయి కానీ ఇంటి పని మనిషి, వీధి వ్యాపారులు వంటి వృత్తులు ఎక్కువగా పన్ను రాయితీ పొందడం వల్ల ఎక్కువ సేవింగ్స్ చేసుకోవచ్చు ఆస్తులు వేగంగా సృష్టించవచ్చు."
మరొకరు "ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదన పై మాత్రమే ఆధారపడదు, సరైన ప్లానింగ్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యమైనవి." మరొకరు "ఇంటివంటి పని చేస్తూ కూడా ఇలా సాధించడం గొప్ప ఉదాహరణ. ఆమెకు సల్యూట్!" ఇలా ఈ ఇంటి పని మనిషి కథా ఆవిడ సేవింగ్స్, వివేకవంతమైన పెట్టుబడులు ద్వారా సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది.


Click it and Unblock the Notifications