GST cut: నేటి నుంచి GST రేట్ కట్ అమలు.. ధరలు తగ్గిన వస్తువులివే..
GST cut: దేశమంతటా ఒకే పన్ను విధానం ఉండాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం GSTని ప్రవేశపెట్టింది. పన్ను వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి, దానిలోని సంక్లిష్టతలను తగ్గించడానికి ఈ పద్ధతిని తీసుకొచ్చింది. కాగా వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల శుభవార్త చెప్పింది. వివిధ గృహోపకరణాలపై GSTని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చింది.
GST అమల్లోకి వచ్చి ఆరేళ్లు కావస్తున్న సమయంలో.. పన్ను తగ్గించబడిన వస్తువుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఆయా గృహోపకరణాలపై అప్పటికీ, ఇప్పటికీ విధిస్తున్న పన్నులో తేడాను చూపించింది. GST కారణంగా 27 అంగుళాల వరకు TVలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మొబైల్ ఫోన్లు, కూలర్లు, ఫ్యాన్లు, గీజర్లు మరియు కొన్ని ఎలక్ట్రిక్ ఉపకరణాలు మరింత చౌకగా మారినట్లు పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వాలు విధించే 17 పన్నులు, 13 సెస్సులను GSTలో కలిపారు. తద్వారా ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించడమే కాకుండా దేశీయ వినియోగాన్ని పెంచినట్లయిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం ప్రకటించింది. ప్రభుత్వానికి సైతం దీనివల్ల సానుకూల ఫలితాలు వచ్చాయి.
2017లో GST ప్రారంభ సమయంలో నెలవారీ పన్ను రాబడి 85 నుంచి 95 వేల కోట్లుగా ఉండేది. ఇది అంచెలంచెలుగా పెరుగుతూ ఏప్రిల్ 2023 నాటికి 1.87 లక్షల కోట్ల ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరింది. యావరేజ్ మీద నెలవారీ ఆదాయం 1.5 లక్షల కోట్లకు పైనే ఉంటోంది. మరోపక్క పౌరుల జీవన ప్రమాణాలు పెంచేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచేందుకు తోడ్పడింది.


Click it and Unblock the Notifications