Jackpot: దేనికైనా అదృష్టం కలిసి రావాలి బాస్.రూపాయలు ఖర్చు చేసి కోట్లు విలువైన ఇంధ్ర భవనాన్ని సొంతం చేసుకోవటం అంటే అంత సులువు కాదు. కానీ అలాంటి సూపర్ జాక్ పాట్ బ్రిటన్ లో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

విలాసవంతమైన ఇల్లు..
యూకేలో విలాసవంతమైన ప్రాపర్టీని దక్కించుకోవటానికి కేవలం రూ.280 సరిపోతుందా అనే అనుమానం మీకు తప్పక కలుగుతుంది. అయితే అసలు దీనివెనుక ఉన్న మర్మంతో పాటు షరతును కూడా తెలుసుకోండి. యూకేలోని మెడ్ వే, కెంట్ లో ఉన్న విలాసవంతమైన మూండతస్తుల భవనం విలువ భారత కరెన్సీ ప్రకారం రూ.3.7 కోట్లు. ఇందులో 4 పెద్ద బెడ్‌రూమ్‌లు, పెద్ద కిచెన్, డైనింగ్ ఏరియా, లివింగ్ రూమ్, మెయింటెనెన్స్ యార్డ్ ఉన్నాయి. పైగా ఈ విలాసవంతమైన ఇంట్లో స్టైలిష్ ఫర్నిచర్, శీతాకాలం కోసం ఫైర్ ప్లేస్ కూడా ఉన్నాయి.

ఇంటికి లాటరీ..
ఎక్కడైనా ఇంటిని లాటరీలో ఇస్తారా..? అని మీకు అనుమానం కలగక మానదు. అయితే ఈ లాటరీ గేమ్ వెనుకు ఉన్న మరో ప్లాన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఈ లాటరీ కాన్సెప్ట్ ను డేనియల్, జాసన్, విల్ ట్విన్‌ఫోర్ అనే ముగ్గురు సోదరులు తీసుకొచ్చారు. వీరు 'Tramway Path' వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరు లాటరీ టిక్కెట్లను అమ్మి దానికి బహుమతిగా ఇలాంటి ఇళ్లను ఇస్తుంటారు. మామూలుగా మనకు లాటరీలో డబ్బు వచ్చినట్టే ఇక్కడ ఇల్లు వస్తుంది.

మతలబు ఏమిటి..?
ఇందులో ఒక షరతు కూడా ఉంది అదేంటంటే.. వారు ఇందుకోసం మెుత్తం 1,55,000 టిక్కెట్లను రూ.280 చొప్పును విక్రయించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఒకవేళ వారు తమ టార్గెట్ టిక్కెట్లను అమ్మితే లాటరీ విజేతకు ఇంటిని బహుమతిగా అందిస్తారు. ఒకవేళ వారు ఆశించిన విధంగా టిక్కెట్లు అమ్ముడు కాకపోతే.. అప్పటి వరకు మెుత్తం అమ్మిన టిక్కెట్ల ద్వారా వచ్చిన సొమ్ములో 70 శాతాన్ని విజేతకు బహుమతిగా అందిస్తారు. వీళ్లు ఇలా ఇళ్లను అమ్మేయటం ఇదే మెుదటిసారి కాదు. కరోనా సమయంలో సోదరులు తమ ఇంటిని ఈ టెక్నిక్ ఉపయోగించి అమ్మేశారు. అప్పటి నుంచి ఇది కొనసాగుతోంది.

ప్రాపర్టీ ప్రత్యేకత..
ట్విన్‌ఫోర్స్ సోదరులు ఆఫర్ చేస్తున్న ఇంటికి నెలకు రూ.1,88,000 అద్దె ఆదాయాన్ని ఇవ్వగలదు. ఇంట్లో వంటగది పూర్తిగా అమర్చబడి ఉంది. ఇంటి నుంచి బయటకు రాగానే మార్కెట్ ఉంది. ఈ ఆస్తి కెంట్‌లోని మెడ్‌వే ప్రాంతంలో ఉంది. లండన్ నుంచి రైలులో సుమారు గంటలోపే ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది లండన్‌లోని చతం రైలు స్టేషన్‌కు సమీపంలో ఉంది. పైగా ఇక్కడ నుంచి లండన్ విక్టోరియా, లండన్ సెయింట్ పాన్‌క్రాస్‌లకు ప్రయాణ సమయం కేవలం ఒక్క గంట మాత్రమే. ఇలాంటి కొత్త రకం లాటరీని కనిపెట్టిన వీరికి సెల్యూట్ చెప్పాల్సిందే.


Click it and Unblock the Notifications