ఇండిగో విమానయాన సంస్థ మరోసారి విమానాలను రద్దు చేయడంతో వరుసగా రెండవ రోజు కూడా ప్రయాణికుల ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా గురువారం (డిసెంబర్ 4, 2025) హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లో పరిస్థితి పూర్తిగా గందరగోళంగా మారింది. ప్రయాణికులు గంటల తరబడి క్యూలలో నిలబడి రావడంతో తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. విమానాల రద్దు, ఆలస్యాలపై ఎయిర్‌లైన్ నుండి సరైన సమాచారం అందక నిరాశ, ఆగ్రహావేశం వ్యక్తం చేశారు.
విమానాశ్రయ అధికారుల సమాచారం ప్రకారం.. గురువారం మొత్తం 68కి పైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. ఇందులో 35 రాకపోకలు (arrivals), 33 నిష్క్రమణలు (departures) ఉన్నాయి. బుధవారం (డిసెంబర్ 3) కంటే ఈ సంఖ్య దాదాపు రెండింతలు ఎక్కువ. నిన్న 31 విమానాలు రద్దు అయి ప్రయాణికులను ఇబ్బందిలో పడేశాయి. టెర్మినల్స్ అంతటా పొడవైన క్యూలు, ఆలస్యం, పలువురు నేలపై కూర్చుని లేదా బెంచీలపై నిద్రపోయే పరిస్థితులు విమానాశ్రయంలో కనిపించాయి.

కేవలం రద్దులు మాత్రమే కాకుండా, గురువారం ప్రయాణించిన అనేక మంది ప్రయాణికులు పలువురు గంటల పాటు ఆలస్యాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. సవరించిన సమయాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్ల గురించి తమకు స్పష్టత ఇవ్వలేదని వారు ఫిర్యాదు చేశారు. విమాన సమాచార డిస్ప్లే బోర్డులు వరుస రద్దు ప్రకటనలతో నిండిపోవడం ప్రయాణికుల్లో మరింత ఆందోళనకు దారితీసింది.
బుధవారం రాత్రి Indigo విడుదల చేసిన ప్రకటనలో.. ఈ అంతరాయాలకు ఊహించని కార్యాచరణ సవాళ్లు కారణమని పేర్కొంది. వీటిలో చిన్న సాంకేతిక లోపాలు, శీతాకాల షెడ్యూల్ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ, సిబ్బందికి అమల్లోకి వచ్చిన కొత్త విమాన విధి సమయ పరిమితులు (FDTL norms) ఉన్నాయి. ఈ కారణాల మిశ్రమ ప్రభావం నేలపై అంచనాలకు మించిన తీవ్ర పరిస్థితిని సృష్టించిందని పేర్కొంది. పరిస్థితిని చక్కదిద్దడానికి తదుపరి 48 గంటల్లో షెడ్యూల్‌లలో మార్పులు చేస్తున్నట్లు కూడా తెలిపింది.
అయితే, సామాజిక మాధ్యమాల్లో ప్రయాణికులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. వైరల్ అయిన వీడియోలలో ప్రయాణికులు కంపెనీ నిర్వహణపై ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఘటనలు కనిపించాయి. హైదరాబాద్-బెంగళూరు విమాన సేవలో ఒక మహిళ.. సిబ్బందిని ప్రశ్నిస్తూ సిబ్బంది అందుబాటులో లేనప్పుడు విమానాన్ని షెడ్యూల్ ఎందుకు చేస్తారు? అత్యవసర ప్రయాణంలో ఉన్న వాళ్లు ఏం చేయాలి? అంటూ ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
6E 883 విమానం మూడు రోజులుగా పదే పదే రద్దు కావడంతో హైదరాబాద్‌లోనే చిక్కుకుపోయానని తెలిపారు. రెండు సార్లు రీషెడ్యూల్ చేశారు, ప్రతిసారి మళ్లీ రద్దు. నా బస ఖర్చులు, రవాణా, పని నష్టాన్ని ఎవరు భరిస్తారు? అంటూ మరో ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 3:15కు మధురైకి ప్రయాణం చేయాల్సిన 6E 6467 విమానం అకస్మాత్తుగా రద్దయ్యిందని ప్లాన్ బి యాప్ ఆప్షన్ పనిచేయకపోవడంతో తాను పూర్తిగా ఇక్కడే చిక్కుకున్నానని మరో ప్రయాణికుడు వాపోయాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఇండిగో విమాన రద్దులు పెరుగుతున్న నేపథ్యంలో DGCA చర్యలు తీసుకోనుందని సమాచారం. ప్రయాణికులు తక్షణ పరిష్కారాన్ని కోరుతూ ఎయిర్‌లైన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications