న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మార్చి నుండి జూన్ మధ్య కాలంలో ఇండియన్ చైన్ హోటల్స్ రూ.8,000 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయాయి. ఇదే కాలంలో ఇండిపెండెంట్ హోటల్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇది 180 శాతం నుండి 200 శాతం మేర పెరుగుతుందని అంచనా. ఈ మేరకు STR హోర్వాత్ HTL's H12020 ఇండియా హోటల్ మార్కెట్ రివ్యూ రిపోర్ట్ వెల్లడిస్తోంది. ఈ నివేదిక ప్రకారం ఇండస్ట్రీ ట్రాకర్ STRతో భాగస్వామ్యం ఉన్న హోటల్స్ లాభనష్టాలను మాత్రమే అంచనా వేసింది.

గత ఏడాది బెస్ట్, ఈసారి వరస్ట్
గత పదేళ్ళ నివేదిక ప్రకారం 2019 సంవత్సరం ఈ హోటల్స్ అత్యుత్తమ తీరును కనబరిచాయి. అలాగే, కరోనా కారణంగా 2020 అత్యంత వరస్ట్‌గా నమోదయింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో H1లో అంటే తొలి అర్ధ సంవత్సరం ఆక్యుపెన్సీ 38.3 శాతంగా ఉంది. 2019లో ఇదే సమయంలో 66.4 శాతంగా ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అయితే ఆక్యుపెన్సీ 15.7 శాతానికి పడిపోయింది. 2019లో ఇదే కాలంలో 62.9 శాతంగా నమోదయింది. ఇదే క్వార్టర్‌లో రెవెన్యూ పర్ అవైలబుల్ రూమ్(RevPAR) రూ.539గా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.3,400గా ఉంది. 2020 H1లో RevPAR రూ.2,200గా ఉంటే, గత ఏడాది ఇదే సమయంలో రూ.3,900గా ఉంది.

ఒక్కో గదిపై దారుణంగా పడిపోయిన ఆదాయం
మార్చి, ఏప్రిల్ 2019లో భారతీయ హోటల్స్‌కు రూమ్స్ విక్రయం ద్వారా సగటున రోజుకు రూ.89,000 ఆదాయం వచ్చింది. గత ఏడాదిలోనే మే నెలలో రోజుకు రూ.85,000, జూన్ మాసంలో రూ.88,000 ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాదిలో దారుణంగా పడిపోయింది. 2020 మార్చిలో రూమ్స్ విక్రయం ద్వారా సగటున రోజుకు రూ.41,000, ఏప్రిల్‌లో రూ.9,000, మేలో రూ.12,000, జూన్ నెలలో రూ.21,000గా ఉంది.
కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో చాలా హోటల్స్ తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. మరికొన్ని హోటల్స్ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించాయని నివేదిక పేర్కొంది. ట్రావెల్ ప్రోటోకాల్స్ కారణంగా జూన్‌లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడాన్ని నిరోధించాయి. వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనల నేపథ్యంలో జూన్ మాసం వరకు ప్రయాణ నిరుత్సాహం వల్ల డిమాండ్ లేదని, ఆగస్ట్ మాసం నుండి డిమాండ్‌ను ఆశించినట్లు తెలిపింది.
నివేదిక ప్రకారం ఎఫ్ అండ్ బీ ఇతర ఆపరేటింగ్ రెవెన్యూ మార్చి నుండి జూన్ మధ్య పడిపోయింది. అయితే రూ.3200 కోట్ల మేర అంచనా వేశారు.

నగరాల విషయానికి వస్తే..
సిటీ లెవల్ విషయానికి వస్తే, ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో 2019 H1తో పోలిస్తే 2020లో ఇదే కాలంలో డిమాండ్ 50 శాతం నుండి 55 శాతం మధ్య క్షీణించింది. గురుగ్రామ్‌లో డిమాండ్ 57 శాతం, పుణేలో 63 శాతం, అహ్మదాబాద్‌లో 42 శాతం క్షీణించింది. గోవాలో 83 శాతం, రాజస్థాన్‌లో 62 శాతం పడిపోయింది.
మార్చి నుండి జూన్ వరకు లగ్జరీ, అప్పర్ అప్ స్కేల్, అప్ స్కేల్ అప్పర్ మిడ్ స్కేల్, మిడ్ స్కేల్ ఎకానమీ సెగ్మెంట్‌లలో రూ.2700 కోట్లు, రూ.1500 కోట్లు, రూ.600 కోట్ల మేర మార్చి నుండి జూన్ కాలంలో క్షీణించింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications