Anant Ambani: అనంత్ అంబానీ పెళ్లా మజాకా.. ఒక్క రాత్రికే హోటల్ అద్దె రూ. లక్ష..
అత్యంత సంపన్న కుటుంబం అయిన ముఖేశ్ అంబానీ కొడుకు పెళ్లికి అంత సిద్ధమైంది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జులై 12న ఒకటి కాబోతున్నారు. ఈ ఏడాది అతిపెద్ద పెళ్లికి ముంబైలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ వివాహానికి ప్రపంచ నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు, బాలీవుడ్ తారలు, రాజకీయాలలోని ప్రముఖులు హాజరు కానున్నారు. ముంబయికి పెళ్లిళ్లకు పెద్ద పెద్దలు రావడంతో హోటళ్లకు డిమాండ్ పెరిగింది.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని 5 స్టార్ హోటళ్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. వాటి ధర కూడా రాత్రికి రూ.లక్షకు చేరుకుంది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జులై 12న ముంబైలోని BKCలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. దీంతో రాత్రిపూట అద్దె రూ.13 వేలు ఉన్న హోటళ్లు ఇప్పుడు రూ.91,350 కు పెంచేశాయి. ప్రస్తుతం పెళ్లికి వచ్చే వారు ఎక్కడ బస చేస్తారనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.

అయితే బీకేసీ సమీపంలోని ప్రాంతాల్లో కూడా హోటల్ అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఈ పెళ్లి కార్యక్రమాలు జులై 12 నుంచి 14 వరకు జరగనున్నాయి. ఈ పెళ్లి కారణంగా ముంబై పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ కూడా జారీ చేశారు. జులై 12 నుంచి 15 వరకు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే అనేక రహదారులు మధ్యాహ్నం 1 నుండి అర్ధరాత్రి వరకు మూసివేయనున్నారు.
జులై 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎలాంటి గదులు అందుబాటులో ఉండవని హోటళ్ల వెబ్‌సైట్లలో కూడా సమాచారం అందించారు. వీటిలో ట్రైడెంట్ BKC, Sofitel BKC ఉన్నాయి. అయినప్పటికీ గ్రాండ్ హయత్, తాజ్ శాంటా క్రజ్, తాజ్ బాంద్రా, సెయింట్ రెజిస్ వంటి 5 స్టార్ హోటళ్లలో ఇప్పటికీ గదులు అందుబాటులో ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయమని బికెసిలో పనిచేస్తున్న ఉద్యోగులు చెప్పారు.


Click it and Unblock the Notifications