గత కొన్ని ఏళ్లుగా భారతదేశంలోని కార్పొరేట్ ఆసుపత్రులు రికార్డు స్థాయి లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ ఆసుపత్రుల ఆర్థిక నివేదికలు అసాధారణమైన ఆదాయ వృద్ధిని చూపుతున్నాయి. ఈ వృద్ధి వెనుక ఉన్న ప్రధాన కారణం ARPOB (Average Revenue Per Occupied Bed) అనే సూచిక. ఇది ఒక ఆసుపత్రిలో ఒక పడకను ఒక రోజు వినియోగించినప్పుడు వచ్చే సగటు ఆదాయాన్ని సూచిస్తుంది. హోటళ్లలో అయితే ప్రతి గదికి ఆదాయం అనే భావనకు ఇది సమానంగా ఉంటుంది.
తాజా డేటా ప్రకారం.. మాక్స్ hospitals రోజుకు ఒక బెడ్‌కి సుమారు రూ. 78 వేలు, ఫోర్టిస్ రూ. 73 వేలు, మేదాంత రూ. 67 వేలు, అపోలో రూ. 62 వేలు ఆర్జిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఆసుపత్రుల బెడ్ ఆక్యుపెన్సీ సగటుగా కేవలం 65 శాలం మాత్రమే ఉంది. అయినప్పటికీ ఇవి రికార్డు లాభాలు పొందుతున్నాయి. దీని వెనుక ఉన్న రహస్యమే క్లినికల్ మిక్స్ అని చెప్పవచ్చు.

క్లినికల్ మిక్స్ అంటే ఏమిటి? క్లినికల్ మిక్స్ అనేది ఒక ఆసుపత్రి చేసే చికిత్సల రకాల నిష్పత్తి. వీటిని నాలుగు విభాగాలుగా విభజించారు:
1. ప్రాథమిక సంరక్షణ: సాధారణ కన్సల్టేషన్లు, హెల్త్ చెకప్‌లు.
2. ద్వితీయ సంరక్షణ: ఫ్రాక్చర్ చికిత్స లేదా కంటి శస్త్రచికిత్స వంటి స్వల్పకాలిక బస.
3. తృతీయ సంరక్షణ: క్యాన్సర్ చికిత్స, డయాలసిస్ వంటి అధిక నైపుణ్యం అవసరమైన చికిత్సలు.
4. క్వాటర్నరీ సంరక్షణ: అవయవ మార్పిడి, క్లిష్టమైన న్యూరో సర్జరీ వంటి అత్యంత ప్రత్యేకమైన చికిత్సలు.
ప్రాథమిక రోగి రోజుకు రూ. 5 వేల నుంచి రూ. 15వేలు మాత్రమే ఆసుపత్రికి ఆదాయాన్ని కలిగిస్తాడు. ఇక తృతీయ, క్వాటర్నరీ చికిత్స పొందే రోగి రోజుకు రూ. 1.5 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు చెల్లిస్తాడు. కాబట్టి ఆసుపత్రులు అధిక ఆదాయం వచ్చే ఈ చికిత్సలపై దృష్టి పెట్టడం వల్ల ARPOB గణనీయంగా పెరుగుతుంది. బెడ్ ఆక్యుపెన్సీ తక్కువ ఉన్నా కూడా లాభాలు పెరుగుతున్నాయి.
ఫోర్టిస్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అశుతోష్ రాఘవన్షి మాట్లాడుతూ.. శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, రోబోటిక్ సర్జరీలు, రేడియేషన్ థెరపీ పెరుగుతున్న కారణంగా ఆదాయం 50 శాతం కంటే ఎక్కువగా పెరిగిందని అంగీకరించారు. ఈ అధిక విలువ కలిగిన చికిత్సలు ARPOBను పెంచుతున్నాయని ఆయన తెలిపారు. మాక్స్ హాస్పిటల్, నారాయణ హృదయాలయ్ వంటి ఇతర ఆసుపత్రుల అధికారులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. లాభదాయకమైన చికిత్సలపై దృష్టి పెట్టడం వల్లే వృద్ధి సాధ్యమైందని వారు చెప్పారు.
ఆస్పత్రులు ఆర్జిస్తున్న ఈ లాభాలు రోగులకు ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. మన ఆరోగ్యం కోసం మనం ఎక్కువ ఖర్చు చేస్తున్నామా, లేక ఈ ఆసుపత్రుల వ్యూహంలో భాగమవుతున్నామా అనేది తెలియని అయోమయ పరిస్థితి. ఒకవైపు ఆసుపత్రులు అధునాతన చికిత్సల ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలు సాధిస్తున్నాయి. మరోవైపు, సాధారణ ప్రజలు ప్రాథమిక చికిత్సలకే అధిక ఖర్చుతో బాధపడుతున్నారు. ఆరోగ్యాన్ని వ్యాపారంగా చూసే ఈ దృక్కోణం.. భారతదేశంలో లాభం ఆరోగ్య చికిత్స అందరికీ అనే అంశాల మధ్య పెరుగుతున్న అంతరాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
ఏదేమైనా భారతదేశంలోని కార్పొరేట్ ఆసుపత్రులు క్లినికల్ మిక్స్ వ్యూహం ద్వారా రికార్డు లాభాలను సాధిస్తున్నాయి. ARPOB పెరగడం ద్వారా ఇవి మరింత బలపడుతున్నాయి. అయితే, రోగుల ఖర్చు భారం పెరగడం వల్ల ఆరోగ్య సంరక్షణ ఒక ప్రాథమిక హక్కా? లేక లాభాల కోసం నడిపించే వ్యాపారమా? అనేది మాత్రం ఇంకా అయోమయంలోనే ఉందని చెప్పవచ్చు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications