OYO NEET Offer: ఓయో సూపర్ ఆఫర్.. NEET పరీక్షా సమయంలో బస చేసే మహిళలకు మెగా డిస్కౌంట్..
OYO NEET Offer: NEET- 2022 మహిళా అభ్యర్థులకు బుధవారం సూపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే.. పరీక్షా కేంద్రానికి వెళ్లే అభ్యర్థులు తమ హోటళ్లలో బస చేస్తే వారికి అత్యధికంగా 60 శాతం వరకు తగ్గింపును అందిచాలని నిర్ణయించింది. ఈ డిస్కౌంటెడ్ స్కీమ్ 2022 జూలై 16, జూలై 17 మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడిచింది.

రెండు రోజులు అందుబాటులో..
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) జూలై 17న దేశవ్యాప్తంగా 497 నగరాల్లోని వివిధ కేంద్రాల్లో నిర్వహించబడుతోంది. అయితే ఇందులో సుమారు 18 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. వీరిలో చాలా మంది మహిళా అభ్యర్థులు ఇతర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రం కేటాయించిన నగరానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు ఇబ్బంది పడకుండా, తగ్గింపు ధరలకు తమ హోటళ్లలో బస చేయవచ్చని హాస్పిటాలిటీ టెక్ సంస్థ తెలిపింది.

బుక్ చేసుకోవటం ఇలా..
ఈ తగ్గింపును పొందేందుకు ముందుగా OYO యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ పరీక్షా కేంద్రానికి సమీపంలో చెల్లుబాటు అయ్యే పార్టిసిపేటింగ్ హోటల్ బసను తెలుసుకునేందుకు 'Nearby' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత 'NEETJF' కూపన్ కోడ్‌ను ఎంచుకుని, Book Now ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత చెల్లింపును పూర్తి చేయాలి. అభ్యర్థులకు అందిస్తున్న అన్ని హోటళ్లలో Wi-Fi, AC సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు కంపెనీ తెలిపింది.

NEET పరీక్ష ఎందుకు నిర్వహిస్తారు..
దేశవ్యాప్తంగా 497 నగరాల్లో ముఖ్యమైన పరీక్షా కేంద్రాల వద్ద పరీక్ష కోసం వచ్చే మహిళా ఔత్సాహికులకు తమ సేవలు అందిస్తామని కంపెనీ వాగ్దానం చేసింది. ఈ తగ్గింపు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకోండి. NEET వైద్య సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించబడుతుంది. ఇది చట్టబద్ధంగా, దేశంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన వైద్య విద్యా ప్రవేశ పరీక్ష.


Click it and Unblock the Notifications