OYO News: భారతదేశ ఆతిథ్య రంగంలో ఓయో హోటల్స్ భారీగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రావెల్ బుకింగ్స్ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న కంపెనీ తాజాగా తన హోటల్ చెకిన్ పాలసీల్లో కీలక మార్పులను ప్రకటించింది. ఇదే వివరాలను కంపెనీ తన పార్టనర్ హోటళ్లకు వెల్లడించింది. అయితే మెుదటగా ఈ మార్పులను మీరట్ నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
కొత్తగా 2025 నుంచి తమ చెకిన్ పాలసీలో చేసిన మార్పుల ప్రకారం పెళ్లి చేసుకోని జోడీలను అనుమతించబోమని వెల్లడించింది. ఓయో తాజాగా సవరించిన పాలసీ ప్రకారం ఆన్‌లైన్ బుకింగ్‌లతో సహా చెక్-ఇన్ సమయంలో జంటలు వారి వివాహ సంబంధానికి సంబంధించిన చెల్లుబాటు అయ్యే రుజువును సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విషయంలో తగిన రుజువులను స్థానిక సెన్సిబిలిటీకి అనుగుణంగా పరిశీలించి బుకింగ్ తిరస్కరించటాని తన భాగస్వాములకు ఓయో విచక్షణాధికారాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కొత్త రూల్స్ యూపీలోని మీటర్ ప్రాంతంలో ముందుగా అమలు చేయబడుతున్నాయని కంపెనీ పేర్కొంది. అయితే రానున్న రోజుల్లో ఈ రూల్స్ దేశవ్యాప్తంగా అన్ని ఓయో భాగస్వామి హోటళ్లకు విస్తరించనుంది.

ఈ చెకిన్ కొత్త రూల్స్ వెంటనే మీరట్ ప్రాంతంలోని హోటళ్లలో అమలులోకి వస్తాయని కంపెనీ నేడు స్పష్టం చేసింది. అయితే ఇక్కడ అందే గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా తర్వాతి ఆచరణపై నిర్ణయం ఉండబోతున్నట్లు సమాచారం. దీనికి ముందు కంపెనీ మీరట్ ప్రాంతంలోని సివిల్ సొసైటీ గ్రూపుల నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేరకు సమస్య పరిష్కారానికి ఈ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే ఇతర అనేక నగరాల నుంచి ప్రజలు సైతం పెళ్లి చేసుకోని జంటలను హోటళ్లలోకి చెకిన్ చేయకుండా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్న వేళ తాజా పరిణామాలు వచ్చాయి. ప్రస్తుతం కంపెనీ తీసుకున్న పరిణామాలు ఆదాయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
దీనిపై ఓయో ఉత్తర భారత రీజినల్ గెడ్ పవస్ షర్మ స్పందించారు. సురక్షితమైన, బాధ్యతాయుతమైన హాస్పిటాలిటీ పద్ధతులను కొనసాగించడానికి ఓయో కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఇదే సమయంలో కంపెనీ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రభావాన్ని కాలానుగుణంగా సమీకర్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కస్టమర్ల లాయల్టీ, బుకింగ్స్ పెంచే క్రమంలో ఇది దోహదపడనుందని కంపెనీ పేర్కొంది. ఓయో పోలీసులు, హోటల్ భాగస్వాములతో సురక్షితమైన ఆతిథ్యంపై ఉమ్మడి సెమినార్‌లు, అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న హోటళ్లను బ్లాక్‌లిస్ట్ చేయడం వంటి పాన్-ఇండియా కార్యక్రమాలను ప్రారంభించింది.
ఓయో న్యూఇయర్ బుకింగ్స్..
ఓయో రూమ్స్ లవర్స్‌గా అడ్డగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇదే విషయంలో ఈసారి నూతన సంవత్సర వేడుకల సమయంలోనూ మరోసారి వెల్లడైంది. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రేమ జంటలు ముందు వరుసలో నిలవటంతో దాదాపు 10 లక్షల మందికి పైగా రికార్డు స్థాయిలో ఓయో రూమ్స్ బుక్ చేసుకున్నట్లు యాజమాన్యం ఇటీవల అధికారిక ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ కాలక్రమేణ లవర్స్ ఏకాంతంగా గడపటానికి వీటిని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఓయో తమ చెకిన్ రూల్స్ మార్చేయటంతో పెళ్లికాని జంటలకు ఇక నో ఎంట్రీ బోర్డు పడనుంది.


Click it and Unblock the Notifications