హార్ముజ్ జలసంధిలో పేలిపోతున్న చమురు ట్యాంకర్లు.. ఇరాన్ తీవ్ర హెచ్చరికతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు..

Hormuz Tensions Escalate: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్‌ల మధ్య సైనిక ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్న వేళ.. ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి అయిన వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద భారీ విధ్వంసం చోటుచేసుకుంది. సముద్రంలో అమర్చిన నావికా మందుపాతరలను (Naval Mines) ఢీకొనడంతో ఏకంగా మూడు చమురు ట్యాంకర్లు భారీ పేలుళ్లతో దగ్ధమైనట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళం, ఇరాన్ సాయుధ దళాల నౌకాదళం వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి.

ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఐబీ (IRIB) కథనం ప్రకారం.. మొదట రెండు ఆయిల్ ట్యాంకర్లు తమ నావిగేషన్, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌లను (AIS) పూర్తిగా నిలిపివేసి, ఇరాన్ అధికారుల అనుమతి లేకుండా నిషేధిత సముద్ర మార్గంలో రహస్యంగా ప్రయాణించేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో మందుపాతరలను ఢీకొట్టడంతో భారీ పేలుళ్లు సంభవించి ఆ రెండు నౌకలకు మంటలు అంటుకున్నాయి.

Iran Navy Strait of Hormuz tanker fires naval mines Iran US tensions oil tankers Hormuz shipping crisis crude oil prices global oil supply Middle East conflict maritime security oil market outlook

మరోవైపు ఇదే సమయంలో హార్ముజ్ జలసంధి గుండా రహస్యంగా వెళ్లేందుకు ప్రయత్నించిన మరో రెండు చమురు ట్యాంకర్లు, ఐఆర్‌జీసీ నావల్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ నుండి హెచ్చరికలు అందగానే అప్రమత్తమయ్యాయి. ఆ రెండు నౌకలు తమ ప్రయాణాన్ని నిలిపివేసి, నిషేధిత మార్గాన్ని దాటకుండా వెనక్కి మళ్లి పర్షియన్ గల్ఫ్ జలాల్లోకి తిరిగి వెళ్లిపోయాయని ఇరాన్ నౌకాదళం తెలిపింది.

అయితే హార్ముజ్ జలసంధికి తూర్పు భాగంలో ఇరాన్ అత్యంత ప్రమాదకరమైనదిగా, నిషేధించబడినదిగా ప్రకటించిన జల ప్రాంతంలో ప్రయాణిస్తున్న మూడో చమురు ట్యాంకర్ సైతం మందుపాతరను ఢీకొని మంటల్లో చిక్కుకుందని ఇరాన్ సాయుధ దళాల నౌకాదళం ప్రత్యేక ప్రకటనలో పేర్కొంది. ముందస్తు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, ట్రాకింగ్ వ్యవస్థలను ఆపివేసి ఆ ప్రాంతంలో సంచరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, పేలుడు ధాటికి మంటలు చెలరేగి ఆ నౌక సముద్రంలోనే నిలిచిపోయిందని స్పష్టం చేసింది.

Also Read

ఈ వరుస సంఘటనల నేపథ్యంలో అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు, నౌకల యజమానులకు ఇరాన్ నౌకాదళం అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. హార్ముజ్ జలసంధికి తూర్పున ఉన్న నిషేధిత జలాల్లోకి ప్రవేశించే ఏ నౌక అయినా మందుపాతరల బారిన పడి అగ్నికి ఆహుతవుతుందని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే భద్రతా హామీలను నమ్ముకుని ట్యాంకర్ యజమానులు తమ నౌకలను ఈ ప్రమాదకర ప్రాంతాల్లోకి పంపిస్తున్నారని ఇరాన్ నౌకాదళం విమర్శించింది. గత సంఘటనల నుండి నౌకా యజమానులు గుణపాఠం నేర్చుకోవాలని, మైన్లు అమర్చిన జలాల్లోకి నౌకలను పంపకుండా ఉండాలని హెచ్చరించింది.

అయితే ఈ మూడు చమురు ట్యాంకర్ల పేలుళ్లకు సంబంధించిన వివరాలన్నీ ప్రస్తుతం ఇరాన్ నౌకాదళం మరియు ఆ దేశ ప్రభుత్వ మీడియా చేసిన ప్రకటనలపైనే ఆధారపడి ఉన్నాయి. వీటిపై అంతర్జాతీయ నావికా దళాలు లేదా స్వతంత్ర సంస్థల నుండి పూర్తిస్థాయి ధృవీకరణ రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ, ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో వరుసగా మూడు ట్యాంకర్లు మంటల్లో చిక్కుకోవడం అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్లలో తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+