అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సంఘ సహాయకులు (VOA), మురికివాడలు, పట్టణస్థాయి సమాఖ్యాల రిసోర్స్ పర్సన్స్ (RP)ల గౌరవ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వేతన పెంపు వేలాది కుటుంబాలకు శుభవార్త. దాదాపు 36 వేల మందికి వేతనం పెరగనుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన పలు హామీలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా, వీఓఏ, ఆర్పీలకు వేతనాలు పెంచుతూ శుభవార్త చెప్పింది.

ఎంత పెంచారు?
గతంలో పై ఉద్యోగులకు రూ.5వేల గౌరవ వేతనం అందేది. అయితే ఇప్పటి ప్రభుత్వం దీనిని రూ.10,000కు పెంచింది. ఇక నుంచి ఆయా సంఘాలు, సమాఖ్యల నుంచి రూ.2 వేలు, ప్రభుత్వం నుంచి రూ.8వేలు వీరికి గౌరవ వేతనం లభిస్తుంది.

ఎంతమందికి ప్రయోజనం?
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 35 వేల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 27,797 మంది VOAలకు, 8,034 మంది RPలకు లబ్ధి చేకూరనుంది. మొత్తంగా సమాఖ్య పరిధిలో ఉండే సంఘాల వ్యవహారాలను 35,831 మంది ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారు.

ఎప్పటి నుంచి అమలు?
డిసెంబర్ 1వ తేదీ నుంచి గౌరవ వేతనాల పెంపు నిర్ణయం అమలులోకి వస్తుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పొదుపు సంఘాల్లో ఎక్కువగా నిరక్షరాస్యులు ఉంటారు. దీంతో ఆర్థిక లావాదేవీలు, నెలవారీ సమావేశాల తీర్మానాల వంటి అంశాలను ఎఫ్పటికి అప్పుడు రికార్డ్ చేసేందుకు, బ్యాంకు అధికారులతో పొదుపు సంఖాలకు సంబంధించిన రుణాలపై మాట్లాడటం వంటి కార్యకలాపాలు వీరు నిర్వహిస్తారు. వీరిని గతంలో యానిమేటర్లు, సంఘమిత్రలు అనేవారు.

ఉత్తర్వులు జారీ
గతంలో చంద్రబాబు ప్రభుత్వం వీరికి ప్రభుత్వం నుంచి రూ.3వేలు, సమాఖ్యల నుంచి రూ.2వేల చొప్పున.. మొత్తం రూ.5వేల గౌరవ వేతనం ఇచ్చేంది. ఆర్పీలకు నామమాత్రపు గౌరవ వేతనం ఉండేది. తాజాగా, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామలారావు సోమవారం వీరి వేతనాలు రూ.5వేల నుంచి రూ.10వేలు పెంచుతూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications