Free Flight Tickets: కరోనా తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. పర్యాటకంపై ఆధారపడిన అనేక దేశాల పరిస్థితి చాలా దిగజారిపోయింది. దీంతో చాలా మంది హౌత్సాహికులు సైతం కొంత కాలంగా పర్యాటనలకు దూరంగా ఉంటున్నారు.

ఆకట్టుకునేందుకు..
మూడు సంవత్సరాల కరోనా పరిమితుల తర్వాత పర్యాటకులను తమ నగరాలకు రప్పించే పనిలో పడింది హాంగ్ కాంగ్. ఇందులో భాగంగా మెుత్తం 5,00,000 విమాన టిక్కెట్లను ఉచితంగా అందిస్తోంది. వీటిని సందర్శకులతో పాటు వ్యాపారులు, ఇన్వెస్టర్లకు అందిస్తున్నట్లు సమాచారం.

హాఫ్ మిలియన్ టికెట్స్..
క్యాథే పసిఫిక్, హాంకాంగ్ ఎక్స్‌ప్రెస్, హాంకాంగ్ ఎయిర్‌లైన్స్ వంటి ఎయిర్‌లైన్స్ ద్వారా ఉచిత విమాన టిక్కెట్లను అందుబాటులో ఉన్నాయి. ఈ టిక్కెట్లు ప్రయాణికులకు మార్చి 1, 2023 నుంచి ఆరు నెలల పాటు పంపిణీ చేయబడతాయి. ఐదు లక్షల టిక్కెట్లలో ఎక్కువ భాగం ఆసియా, యూరప్, యూఎస్ లోని ప్రయాణికులకు ఆఫర్ చేయబడతాయని తెలుస్తోంది. అయితే స్థానిక నివాసితులకు వీటిలో కొంత భాగాన్నే అందిస్తోంది.

ఆఫర్ వివరాలు..
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఒక టిక్కెట్ కొన్న వారికి మరో టిక్కెట్ ఉచితాన్ని ప్రకటించింది హాంగ్ కాంగ్. వీటికి తోడు లక్కీ డ్రాలు, గేమ్ పోటీలు, ప్రచార ప్యాకేజీల ద్వారా టిక్కెట్లు పంపిణీ చేయబడతాయని వెల్లడైంది. 'హలో హాంకాంగ్' పేరుతో ప్రచారం హాంకాంగ్ నాయకుడు జాన్ లీ ప్రచారంలో భాగంగా రెండు మిలియన్ డాలర్లను వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది.

లెక్కలేనన్ని ఆఫర్లు..
కరోనా రూల్స్ సడలించినందున ఐసోలేషన్ లేదా క్వారంటైన్ లాంటివి ఉండబోవని నొక్కి చెప్పింది. దీనికి తోడు హాంకాంగ్ టూరిజం బోర్డు విదేశీ ప్రయాణికులకు ఉచిత పానీయాలు, షాపింగ్, భోజన వోచర్లు వంటి స్వాగత బహుమతులను కూడా అందిస్తోంది. కరోనాకు ముందు నగరానికి పర్యాటకుల సంఖ్య 56 మిలియన్లుగా ఉండగా.. 2022లో ఈ సంఖ్య కేవలం 605,000కి పడిపోవటంతో హాంగ్ కాంగ్ ఈ నిర్ణయం తీసుకుంది. పైగా చైనీస్ ప్రత్యేక పరిపాలనా ప్రాంతంలో పర్యాటకం, వ్యాపారం, పెట్టుబడులను పెంచటాన్ని లక్ష్యంగా నగరం ముందుకు సాగుతోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications