ప్రముఖ వాహన సంస్థ, భారత మార్కెట్లో రెండో అతిపెద్ద టూవీలర్ మేకర్ హోండా మోటార్ సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా(HMSI) తమ సంస్థ ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీం(VRS)ను ప్రకటించింది. 2019లో మందగమనం, 2020లో కరోనా మహమ్మారి కారణంగా వాహన పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. డిమాండ్ భారీగా పడిపోయింది. ఇప్పుడిప్పుడే డిమాండ్ కాస్త కోలుకుంటోంది. వరుస మందగమనంతో వాహన పరిశ్రమ దెబ్బతిన్నది. దీంతో హోండా సంస్థ ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీంను తీసుకు వచ్చింది.

వీఆర్ఎస్‌కు వీరు అర్హులు
ఈమేరకు హోండా కంపెనీ సర్క్యులర్ విడుదల చేసింది. ఉత్పత్తి వ్యూహం రూపొందించేందుకు, అలాగే, ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ వీఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు హోండా తెలిపింది. 40 ఏళ్లకు పైబడిన, కంపెనీలో పదేళ్లకు పైగా పని చేస్తోన్న ఉద్యోగులు ఈ వీఆర్ఎస్ స్కీంకు అర్హులు అని వార్తలు వచ్చాయి.

HMSI ఏం చెప్పిందంటే
భారత్‌లో కొవిడ్ కారణంగా డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. భారత్‌లో ఉనికిని కాపాడుకునేందుకు ఇది తప్పలేదని ఉద్యోగులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. వాహన పరిశ్రమ గడ్డుకాలం ఎదుర్కొందని, డిమాండ్ తగ్గడం, ఆర్థిక పతనం, కరోనా ప్రభావం తీవ్రంగా పడిందని, ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో కార్యకలాపాల సామర్థ్యం పెంచుకునేలా ప్రొడక్షన్ వ్యూహాన్ని నిర్ణయించుకున్నట్లు HMSI తెలిపింది.

తొలి 400 మందికి రూ.5 లక్షలు అదనం
2021 జనవరి 31వ తేదీ నాటికి 40 ఏళ్లు పైబడిన వారు లేదా హోండాలో 10 ఏళ్ల అనుభవం కలిగిన వారు ఈ వీఆర్ఎస్ స్కీంను ఉపయోగించుకోవచ్చు. భారత్‌లోని నాలుగు ప్లాంట్లలో 2020 మార్చి 31వ తేదీ నాటికి 7వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా, ఈ వీఆర్ఎస్ ప్యాకేజీని అంగీకరించిన మొదటి 400 మందికి అదనంగా రూ.5,00,000 ఇస్తామని తెలిపింది. ఇక, వీఆర్ఎస్ స్కీంను ఎంచుకుంటే ఈ ప్యాకేజీ కింద మూడు నెలల గ్రాస్ శాలరీ, ఒక నెల బేసిక్ పే, అలాగే, మిగిలిన నెలలకు వేరియేబుల్ డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తారు. ఎక్స్-గ్రేషియా రూ.22,000.
ఈ స్కీం కింద సీనియర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, పర్మినెట్ వర్క్ మెన్ గరిష్టంగా రూ.72 లక్షలు, మేనేజర్ రూ.67 లక్షలు, డిప్యూటీ మేనేజర్ రూ.48 లక్షలు, అసిస్టెంట్ మేనేజర్ రూ.36 లక్షలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ రూ.3 లక్షలు, ఎగ్జిక్యూటివ్ రూ.27 లక్షలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రూ.15 లక్షల వరకు పొందుతారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications