ఇండియాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఆశించినంతగా లేనప్పటికీ ఇళ్ల అమ్మకాలు ఇంకా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సేల్స్ మాత్రం జోరందుకుంటుంన్నాయి. గతంతో పోల్చుకుంటే కరోనా మహమ్మారికి ముందు ఉన్న ఇళ్ల అమ్మకాలు ఇప్పుడు మరింతగా పెరిగాయి. ఇందుకు తాజా గణాంకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గ్లోబల్ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ JLL ప్రకారం టాప్ ఏడు భారతీయ నగరాల్లో రూ. 5.1 ట్రిలియన్ల విలువైన ఇల్లులు 2024లోగా అమ్ముడవుతాయని అంచనా. అయితే సుమారు ఈ 3 లక్షల ఇల్లులు 485 మిలియన్ చదరపు అడుగుల (ఎంఎస్ఎఫ్) విస్తీర్ణంలో ఉండొచ్చు అని భావిస్తున్నారు.

ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే టాప్ ఏడు నగరాల్లో హౌసింగ్ సేల్స్ పరంగా 2024 బెస్ట్ ఇయరుగా ముగుస్తుంది. కోవిడ్ తరువాత ఏడాది ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలు స్థిరమైన పెరుగుదలను చూపించాయి, కానీ 2023లో అత్యధికంగా 2.7 లక్షల ఇల్లులు అమ్ముడయ్యాయి.
అంతకుముందు ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ తొమ్మిది నెలల కాలంలో అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయి. ఈ కాలంలో 363.2 msf విస్తీర్ణంలో రూ.3.8 ట్రిలియన్ల విలువైన 2.3 లక్షల ఇల్లులు అమ్ముడయ్యాయి. సగటున ప్రతి త్రైమాసికానికి రూ. 1.1 ట్రిలియన్ల సేల్స్ జరిగాయి. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR), ముంబై, పూణే, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు సహా హైదరాబాద్ ఇందులో మొదటి ఏడు నగరాలు.
అలాగే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అపార్ట్‌మెంట్స్ ఆవరేజ్ సేల్స్ వాల్యూ రూ. 1.64 కోట్లకు చేరిందని REIS, ఇండియా, JLL, చీఫ్ ఎకనామిస్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ సమంతక్ దాస్ తెలిపారు. ఇది ముఖ్యంగా ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్ట్‌ల ద్వారా నడిపించిందని సమంతక్ దాస్ పేర్కొన్నాడు,
నగరాల వారీగా చూస్తే జనవరి-సెప్టెంబర్ 2024లో ఢిల్లీ NCR సేల్స్ వాల్యూ ఇంకా అమ్మకాల పరంగా ముందుంది. ఈ కాలంలో ఎన్‌సిఆర్‌లో రూ. 1.2 ట్రిలియన్లకు పైగా విలువైన 39,300 యూనిట్ల విక్రయాలు జరిగింది. జనవరి - సెప్టెంబరు 2024 మధ్య నగరంలోని అమ్మకాలు గత ఏడాది అమ్మకాలను ఇప్పటికే అధిగమించాయి.
విక్రయించిన ఇళ్ల విలువ పరంగా ఢిల్లీ ఎన్‌సిఆర్ తరువాత ముంబై ఉండగా, విస్తీర్ణం పరంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. "ముంబైలో అపార్ట్‌మెంట్లు విస్తీర్ణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ ప్రతి చదరపు అడుగు విలువ ఎక్కువగా ఉందని స్పష్టంగా సూచిస్తుంది, అయితే బెంగళూరు విశాలమైన ఇళ్లను అందిస్తుంది" అని నివేదిక పేర్కొంది. భారతదేశంలోని టాప్ ఏడు నగరాలు 5.1 లక్షల కోట్ల విలువైన 3 లక్షలకు పైగా ఇళ్లను విక్రయించాయి.
1. బెంగళూరు: 51,512 (62,128 కోట్లు)
2. ముంబై: 50,209 (94,883 కోట్లు)
3. పూణే: 39,723 (39,393 కోట్లు)
4. ఢిల్లీ ఎన్సిఆర్ : 39,322 (1,21,927 కోట్లు)
5. హైదరాబాద్: 26,331 (42,020 కోట్లు)
6. కోల్ కత్తా: 13,548 (8,869 కోట్లు)
7. చెన్నై : 9,263 (8,041 కోట్లు)
ఢిల్లీ ఎన్‌సిఆర్, ముంబై కంటే బెంగళూరు ఎక్కువ ఇళ్లను విక్రయించింది. JLL ప్రకారం చాలా మంది ప్రముఖ నేషనల్-లెవెల్ డెవలపర్‌లు ఇప్పటికే తొమ్మిది నెలల వ్యవధిలో వారి అంచనా ప్రకారం టార్గెట్స్ సేల్స్ చేరుకున్నారు.


Click it and Unblock the Notifications