ఇళ్ళ అమ్మకాలు దాదాపు కరోనా ముందుస్థాయికి చేరుకున్నట్లు రియాల్టీ సేవల సంస్థల సర్వేలో వెల్లడవుతోంది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో కరోనా ముందుస్థాయిని మించి విక్రయాలు నమోదయ్యాయని నైట్ ఫ్రాంక్ వెల్లడించగా, ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు రెండింతలకు పైగా పెరిగినట్లు జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. ఆఫీస్ లీజ్ స్థలం కూడా 168 శాతం పెరిగిందని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. జనవరి-సెప్టెంబర్ ఆఫీస్ మార్కెట్ ఇంక్రిమెంటల్ యాక్టివిటీ వ్యాల్యూమ్ పరంగా 13 శాతం పెరగగా, కొత్త ఆఫీస్ కంప్లీషన్ పరంగా 6 శాతం వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించింది. ప్రముఖ రియాల్టీ సంస్థలు జేఎల్ఎల్, నైట్ ఫ్రాంక్ నివేదికలు ఇలా ఉన్నాయి....

విక్రయాలు 47 శాతం జంప్
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు రెండింతలకు పైగా పెరిగినట్లు జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ నగరాల్లో 32,358 ఇళ్లను విక్రయించినట్లు వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో కేవలం 14,415 ఇళ్లను విక్రయించింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో 19,635 ఇళ్లు అమ్ముడుపోయాయి.
హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, పుణే, బెంగళూరు నగరాల్లో నివాస గృహాల విక్రయాలపై ఈ నివేదిక విడుదలైంది. హైదరాబాద్ నగరంలో ఇళ్ల విక్రయాలు 2,122 నుండి రెండింతలకు పెరిగి 4,418కి చేరుకున్నాయి. బెంగళూరులో 1742 నుండి 5100కు, ఢిల్లీలో 3112 నుండి 6689, కోల్‌కతాలో 390 నుండి 1974, ముంబైలో 4135 నుండి 6756కు, పుణేలో 1344 నుండి 5921కు పెరిగాయి. కేవలం చెన్నైలో మాత్రం 1570 నుండి 1500కు తగ్గాయి. 2021 జనవరి - సెప్టెంబర్ త్రైమాసికంలో 77,576 ఇళ్లు విక్రయించగా, 2020లో ఇదే కాలంలో 52,619గా ఉన్నాయి. అంటే 47 శాతం అధికం.

కరోనా ముందుస్థాయికి విక్రయాలు
జూలై-సెప్టెంబర్ కాలంలో ఇళ్ల విక్రయాలు కరోనా ముందుస్థాయికి చేరుకున్నట్లు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ధరలు స్థిరంగా ఉండటం, తక్కువ వడ్డీ రేట్ల నేపథ్యంలో సేల్స్ పెరుగుతున్నట్లు తెలిపింది. 2020 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 33,404 ఇళ్లను విక్రయించగా, ఈసారి దాదాపు రెండింతలు పెరిగి 64,010కి చేరుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్-జూన్ కాలంలో 27,453 ఇళ్లను విక్రయించింది.
హైదరాబాద్‌లో నివాస గృహాల విక్రయాలు 1609 నుండి మూడు రెట్లు పెరిగి 5987కు పెరిగాయి. ముంబైలో 7635 నుండి 15942కు, ఢిల్లీలో 6147 నుండి 9101కి, బెంగళూరులో 4912 నుండి 11337కు, పుణేలో 4918 నుండి 9565కు, చెన్నైలో 3085 నుండి 3610కి, కోల్‌కతాలో 3921 నుండి 6861కి, అహ్మదాబాద్‌లో 1176 నుండి 1607కు పెరిగాయి.
రూ.50 లక్షల నుండి రూ.1 కోటి మధ్య ఉన్న గృహాల విభాగం 32 శాతం నుండి 35 శాతానికి పెరిగింది. రూ.50 లక్షల లోపు ఇళ్ల విభాగం మాత్రం 45 శాతం నుండి 43 శాతానికి తగ్గింది. ఈ కాలంలో హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఇళ్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. అన్ని ప్రధాన నగరాల్లో సగటున ధరలు స్థిరంగా ఉన్నాయి.

ఆఫీస్ లిజింగ్ జంప్
ఆఫీస్ లీజింగ్ స్పేస్ ప్రధాన నగరాల్లో ఏడాది ప్రాతిపదికన 168 శాతం పెరిగింది. కొత్త ఆఫీస్ కంప్లీషన్ మూడో త్రైమాసికంలో 67 శాతం పెరిగింది. 8 ప్రధాన నగరాల్లో జులై-సెప్టెంబర్‌లో 12.5 మిలియన్ చ.అ. స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఐటీ రంగం నుంచి అధిక డిమాండ్ ఉండటం సహా ఆర్థిక వ్యవస్థ సాధారణస్థాయికి వస్తుండటం, కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు రప్పించడం వంటి అంశాలు లీజింగ్ డిమాండ్ పెరగడానికి దోహదపడినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications