2020లో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లోని ఎనిమిది ప్రధాన నగరాల్లో హోమ్ సేల్స్ కరోనా పూర్వస్థాయికి చేరుకున్నాయి. గత దశాబ్ద కాలంలోనే అతి తక్కువ వడ్డీ రేట్లు, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో సుంకాల తగ్గింపు వంటి వివిధ అంశాలు తోడ్పడినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. భారత్‌లోని టాప్ 8 నగరాల్లో కలిపి సేల్స్ భారీగా రికవరీ అయ్యాయి. ఈ నగరాల్లో దాదాపు 100 శాతం కోలుకున్నాయి. నైట్ ఫ్రాంక్ నివేదిక 2020 ప్రకారం నాలుగో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 61,593 యూనిట్లతో కోవిడ్ ముందుస్థాయికి చేరుకున్నాయి.

రియాల్టీ జూమ్
కరోనా కారణంగా గత ఏడాది రియల్ ఎస్టేట్ రంగం కుదేలయింది. కానీ 2020 క్యాలెండర్ ఏడాది చివరి త్రైమాసికంలో రికవరీ బాట పట్టడం గమనార్హం. ఇళ్ల కొనుగోళ్లు, కార్యాలయ స్థలం లీజింగ్ రెండు కూడా పెరిగాయి. త్రైమాసికంలో ఇళ్ల కొనుగోళ్లు 58,402 నుంచి 61,593 యూనిట్లకు పెరిగాయి. గత ఏడాది ద్వితియీర్ధంలో హైదరాబాద్‌లో 5260 ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఇళ్ల అమ్మకాల్లో 127 శాతం వృద్ధి నమోదయింది.

ఆఫర్లు.. వడ్డీ రేట్లు
పండుగల సందర్భంగా కొనుగోలుదారులకు రియాల్టర్లు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనువుగా ఉన్న ఇళ్ల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపారు. దీనికి తోడు వడ్డీ రేట్లు తగ్గడం కూడా కలిసి వచ్చింది. ప్రధానంగా రూ.50 లక్షల లోపు ఇళ్లకు డిమాండ్ భారీగా కనిపించింది. 2019 ద్వితీయార్ధంతో పోలిస్తే 2020 ద్వితీయార్ధంలో ఇళ్ల అమ్మకాల్లో 24 శాతం వృద్ధి కనిపించింది.

95 వేల ఇళ్లు..
హైదరాబాద్ విషయానికి వస్తే మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో డిమాండ్ భారీగా పుంజుకుంది. గత ఏడాది జూలై - డిసెంబర్ కాలంలో 2.22 కోట్ల చదరపు అడుగుల నిర్మాణ స్థలానికి సంబంధించిన లావాదేవీలు నమోదు అయ్యాయి. గత ఏడాదిలో కరోనా కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైనప్పటికీ సంవత్సరం చివరి నాటికి కోలుకున్నట్లు తెలిపింది. గత ఏడాది ద్వితీయార్ధంలో 8 నగరాల్లో 94,997 ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. రూ.50 లక్షల కంటే అధిక ధర కలిగిన ఇళ్ల అమ్మకాల వాటా 57 శాతం వాటా ఉంది.


Click it and Unblock the Notifications