loans: గృహరుణాల్లో డబుల్ డిజిట్ వృద్ధి.. ఇక పర్సనల్ లోన్స్ అయితే ఏకంగా..
loans: పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, ద్రవ్యోల్బణం దృష్ట్యా.. దేశంలో రుణగ్రహీతలు ఎక్కువయ్యారు. ముఖ్యంగా గృహరుణాలు తీసుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. పర్సనల్ లోన్స్ సైతం మంచి వృద్ధిని కనబరిచాయి. రిటైల్ రుణాల పంపిణీ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల పాత్ర అధికంగా ఉంది.
2022 సంవత్సరంలో దేశం మొత్తం మీద 34 లక్షల గృహ రుణాలు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటి విలువ 9 లక్షల కోట్లకు పైమాటేనట. ఈ విభాంగంలో 18 శాతం వార్షిక వృద్ధి నమోదు చేయబడింది. డేటా అనలిటిక్స్ ఫర్మ్ ఈక్విఫాక్స్ మరియు లోన్ డిస్ట్రిబ్యూటర్ ఆండ్రోమెడ రిటైల్ రుణాలపై జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

మొత్తం రుణాలలో 25 లక్షల కంటే తక్కువ సైజు కేటగిరీకి గరిష్ఠ సంఖ్యలో ఇచ్చినట్లు అధ్యయనం తేల్చింది. 2022 క్యాలెండర్ సంవత్సరంలో పంపిణీ చేసిన రుణాల్లోనూ 17 శాతం పెరుగుదల ఉన్నట్లు చెప్పింది. అదే ఏడాది పర్సనల్ లోన్ సెగ్మెంట్ సైతం 57 శాతం ఆకట్టుకునే వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించింది. డిసెంబర్ 2022 నాటికి రిటైల్ ఇండస్ట్రీ మార్కెట్ పరిమాణం 100 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది.
వివిధ విభాగాలలో చూస్తే రిటైల్ పరిశ్రమ 54 కోట్ల యాక్టివ్ రుణాలను నివేదించినట్లు అధ్యయనం కనుగొంది. ఇక గృహ రుణ విభాగం సాధించిన వృద్ధిపై లోన్ డిస్ట్రిబ్యూటర్ ఆండ్రోమెడ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ స్వామినాథన్ పలు విషయాలు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFC) అన్నీ మంచి సాధిస్తున్నాయని స్పష్టం చేశారు. మొత్తం మీద గృహ రుణ వ్యాపారం బాగా సాగుతుందని వివరించారు.


Click it and Unblock the Notifications