కరోనా మహమ్మారి వల్ల ప్రజల ప్రాధాన్యతలు మారిపోయాయి. వారు తమ తమ ఖర్చులు, పెట్టుబడులను చాలా దగ్గరగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఫిన్ టెక్ ప్లేయర్ తన మూడవ ఎడిషన్ బ్యాంక్ బజార్ మనీమూడ్ 2021 నివేదికలో తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) కింద వడ్డీ రేట్లు తగ్గడం, బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడం, అలాగే కొన్ని సర్కిల్స్‌లో తక్కువ రిజిస్ట్రేషన్ ఖర్చు వంటి వివిధ అంశాలు ప్రభావం చూపి హోమ్ లోన్ సగటు రూ.26 లక్షలకు పెరిగినట్లు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది.

23.64 లక్షల నుండి 26.04 లక్షలకు
కరోనా కారణంగా ప్రాధాన్యతలు మారాయని, ఖర్చులు, పెట్టుబడులను దగ్గరగా అంచనా వేస్తున్నారని బ్యాంక్ బజార్ మనీ మూడ్ 2021 నివేదిక మూడో ఎడిషన్‌లో తెలిపింది. కరోనా సంక్షోభం కుదిపేసినప్పటికీ ఈ ఏడాది హోమ్ లోన్ సగటు రూ.26.41 లక్షలకు పెరిగింది. 2019లో ఇది రూ.23.64 లక్షలుగా ఉంది. ఈ ఏడాది మహిళా రుణ గ్రహీతలు హోమ్ లోన్ సగటు రూ.25.66 లక్షల నుండి రూ.31.20 లక్షలకు పెరిగింది. పురుషుల హోమ్ లోన్ సగటు రూ.23.64 లక్షల నుండి రూ.26.04 లక్షలకు చేరుకుంది.

అందుకే వడ్డీ రేట్లు తగ్గాయి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన, భారీగా తగ్గిన వడ్డీ రేట్లు, కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ వ్యయం తగ్గడం వల్ల ఇళ్లకు డిమాండ్ పెరిగిందని బ్యాంక్ బజార్ మనీ మూడ్ తెలిపింది. లాక్ డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని, దీంతో డిజిటల్ కేవైసీ ద్వారా రుణం పొందగలిగే వెసులుబాటు కలిగిందని, దీంతో రుణ మంజూరు ప్రీ-కోవిడ్ స్థాయిలో 80 శాతానికి చేరుకుందని తెలిపింది.

రూ.30 లక్షల లోపు రుణవాటా ఎంతంటే
మొత్తం గృహ రుణాల్లో రూ.30 లక్షల లోపు రుణాల వాటా గత ఏడాదిలో 72 శాతంగా ఉంది. ఈ ఏడాది ఇది 68 శాతానికి తగ్గింది. నాన్-మెట్రో నగరాల నుండి డిమాండ్ పెరిగింది. ఈ సంవత్సరంలో అతిపెద్ద హోమ్ లోన్ బెంగళూరు నుండి రూ.1.46 కోట్లు కాగా, నాన్-మెట్రోలో లక్నో నుండి రూ.64.50 లక్షలు. 2021లోను మార్కెట్ ఆశాజనకంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. మెట్రోల్లో సగటు పర్సనల్ లోన్స్ రూ.1.84 లక్షలు కాగా, నాన్-మెట్రోల్లో రూ.2.06 లక్షల కోట్లుగా ఉంది. క్రెడిట్ కార్డు విభాగంలోను మెట్రోల కంటే నాన్-మెట్రోలు ముందున్నాయి. నాన్ మెట్రోలలో మహిళల దరఖాస్తులు 240 శాతం పెరిగాయి. క్రెడిట్ కార్డు వినియోగదారులు ఆన్ లైన్ షాపింగ్ రివార్డ్స్, క్యాష్ బ్యాక్స్ వైపు మొగ్గు చూపారు.ఈ పరిస్థితి కొనసాగే అవకాశముందని తెలిపింది. కాంటాక్ట్‌లెస్ రుణ పంపిణీ దక్షిణ భారతంలో అత్యధికంగా 40 శాతంగా నమోదయింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications