భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ సమావేశం (MPC Meeting) బుధవారం నుంచి ప్రారంభమైంది. మూడు రోజుల పాటు శుక్రవారం వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వరుసగా మూడోసారి కీలక రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా ఇప్పుడు ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం లక్ష్యం కంటే తక్కువగా నమోదైంది. ఇందులో భాగంగానే వృద్ధికి ఊతమిచ్చేందుకు మరోసారి వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.ఈ నెల ఆరో తేదీన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్యపరమైన విధాన నిర్ణయాలను ప్రకటించనున్నారు.కాగా మూడు రోజుల పాలసీ సమావేశం ముగిసిన తర్వాత శుక్రవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత ఫిబ్రవరి 7న RBI రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి తీసుకువచ్చింది ఆర్బీఐ . 2025లో తొలి రేటు కోత తర్వాత ఏప్రిల్ 9న మరో సారి రెపో రేటు తగ్గించింది. ఇప్పుడు ఆర్బీఐ 3వ సారి రెపోరేటు తగ్గిస్తే.. రెపో రేటు 6 శాతం కంటే తక్కువగా ఉంటుంది.ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభమైన రేటు తగ్గింపు అనేది మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.
SBI రీసెర్చ్ నివేదిక ప్రకారం.. 50 బేసిస్ పాయింట్ల అధిక రేటు తగ్గింపును అది అంచనా వేసింది . భారత ఆర్థిక వ్యవస్థలో తగ్గుతున్న దేశీయ ద్రవ్యత, ఆర్థిక స్థిరత్వ ఆందోళనలు దీనికి కారణమని SBI రీసెర్చ్ విశ్లేషకులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రుణగ్రహీతలకు వారి గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గవచ్చు. బ్యాంకులు రేటు తగ్గింపు ప్రయోజనాన్ని తమ వినియోగదారులకు బదిలీ చేసిన తర్వాత ఇది మీ గృహ రుణ EMIని మరింత తగ్గించే అవకాశం ఉంది.
ప్రభుత్వ సెక్యూరిటీలపై రుణాలు తీసుకున్నప్పుడు బ్యాంకులు ఆర్‌బిఐకి చెల్లించాల్సిన వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ఆర్బీఐ ద్వారా బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు పొందితే వారు తమ వినియోగదారులకు తక్కువ రేటుకు మరిన్ని రుణాలు ఇవ్వగలుగుతారు.అయితే ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించినప్పటికీ అదే నిష్పత్తిలో బ్యాంకులు రెపో రేటును తగ్గించాలని చెప్పే నియమం ఏదీ లేదు. బ్యాంకులు తగ్గించవచ్చు లేదా అలాగే వడ్డీ రేటును ఉంచవచ్చు.
గతంలో ఆర్బీఐ రెపోరేటు తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు తమ రుణ రేట్లను తగ్గించాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ రుణాల రేట్లను తగ్గించాయి.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications