బ్యాంకింగ్ రంగంలో ఇప్పటి వరకు ఎన్నెన్నో ఆఫర్లు, ప్యాకేజీలు చూశాం. అఫ్‌కోర్స్ వాటిలో చాలా వరకు కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టేవే అన్నది వేరే విషయం. పట్టణీకరణ పెరుగుతోన్న క్రమంలో వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లించే ఈఎంఐ విధానానికి ఆదరణ బాగా పెరిగింది. కస్టమర్ల అభిమానాన్ని కూడా చూరగొనే కొన్ని బ్యాంకులు మరో అడుగు ముందుకేసి వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తున్నాయి. ఈక్రమంలో..
సున్నా వడ్డీకే హోమ్‌లోన్ ఇస్తామంటూ ఒక బ్యాంకు సంచలన ఆఫర్ ప్రకటించింది. దాని పేరు నార్డియా బ్యాంక్. యూరప్ లోని డెన్మార్క్ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ బ్యాంకు.. 20 ఏళ్లపాటు ఇంటి రుణాన్ని ఎలాంటి వడ్డీ లేకుండానే ఇచ్చేస్తానంటూ ప్రకటించిన ఆఫర్ ప్రస్తుతం ప్రపంచమంతటా చర్చనీయాంశమైంది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఇతర బ్యాంకులు కూడా నార్డియా బ్యాంక్ రూట్‌లోనే వెళ్తున్నాయి.

నిజానికి డెన్మార్క్ లో బ్యాంకుల తీరే వేరు. ఇతర దేశాల్లోలాగా కస్టమర్లను, అప్పులు తీసుకున్నవాళ్లను చచ్చే స్థితిని నెట్టేయడం అక్కడ ఉండదు. ప్రపంచంలో సున్నా కాదు కదా.. మైనస్‌లో వడ్డీ రేట్లు ఉన్న ఏకైక దేశం డెన్మార్కే. ప్రపంచంలో మరే దేశం ఇవ్వనంత కాలం ఇవే రేట్లను డెన్మార్క్ కొనసాగించింది. 2012లో తొలిసారి అక్కడి ప్రభుత్వం వడ్డీ రేట్లను సున్నా కంటే తక్కువకు తగ్గించినప్పుడు డెన్మార్క్‌లో సొంత ఇల్లు కొన్న వాళ్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది.
అసలు ఏమాత్రం వడ్డీ లేకుండా 20 ఏళ్లకు ఇంటిపై రుణం ఇవ్వడం అంటే నమ్మశక్యం కానిదే. ఇప్పుడు డెన్మార్క్‌లోని నార్డియా బ్యాంక్ ఏబీపీ సున్నా వడ్డీకే హోమ్‌లోన్ ఇస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచకుండా అలాగే ఉంచుతున్నాయి. 2021లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని బ్లూమ్‌బర్గ్ స్పష్టం చేసింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications