IPO News: తొలిరోజే ఐపీవో రికార్డులు.. బంపర్ లాభాలతో అప్పర్ సర్క్యూట్‌లో లాక్..
IPO News: ఈవారం తొలిరోజే మార్కెట్లో లిస్ట్ అయిన ఐపీవో ఇన్వెస్టర్లకు బంపర్ రాబడిని అందించింది. పేరుకే చిన్న కంపెనీ.. అయినప్పటికీ పెద్ద లాభాలను ఇన్వెస్టర్లకు ఇచ్చి మెుదటిరోజే వారిని ధనవంతులుగా మార్చేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది నేడు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హోల్‌మార్క్ ఆప్టో మెకాట్రానిక్స్ కంపెనీ ఐపీవో గురించే. ప్రీమియం ధరకు మార్కెట్లోకి అడుగుపెట్టిన స్టాక్ షేర్లు పొందిన పెట్టుబడిదారులను ధనవంతులుగా మార్చేసింది. ఏకంగా 65 శాతం ప్రీమియంతో రూ.65.25 రేటుకు జాబితా చేయబడింది. అసలు కంపెనీ ఒక్కో షేరును రూ.40కి విక్రయించగా.. ప్రారంభంలోనే రూ.25.25 లాభాన్ని సంపాదించి పెట్టింది.

ఐపీవో లిస్టింగ్ తర్వాత హోల్‌మార్క్ ఆప్టో మెకాట్రానిక్స్ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. దీంతో కంపెనీ షేర్లు రూ.68.50 రేటుకి చేరాయి. కంపెనీ IPO 15 సెప్టెంబర్ 2023న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడి సెప్టెంబర్ 20న ముగిసింది. కంపెనీ ఐపీవో దరఖాస్తు దారులకు షేర్ల కేటాయింపును 25 సెప్టెంబర్ 2023న ఖరారు చేసింది.
కంపెనీ IPO ఇష్యూ సమయంలో ఇన్వెస్టర్ల నుంచి బలమైన స్పందనను పొందింది. ఈ క్రమంలో 85.81 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. కంపెనీ IPO రిటైల్ కోటా 75.78 రెట్లు, ఇతర కేటగిరీల్లో 93.27 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైప్ అయింది. కంపెనీ IPOలో రిటైల్ పెట్టుబడిదారులు 1 లాట్‌కు 3000 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ నిర్ణయించింది. అంటే ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొనాలంటే రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఐపీవోకు ముందు కంపెనీలో ప్రమోటర్ల వాటా 87.30 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 62.54 శాతానికి తగ్గింది.


Click it and Unblock the Notifications