హోలీ షాపింగ్ సందడి: మార్కెట్లలో పండుగ కళ! ఈసారి రూ.60 వేల కోట్లు దాటే ఛాన్స్ !
హోలీ సంబరాలు మొదలయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో సొంత ఊర్లకి వెళ్ళడానికి ఇప్పటికే ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతున్నారు. అయితే ఈసారి హోలీ పండగ శుక్రవారం కావడంతో మరింతగా కలిసొచ్చింది అని చెప్పవచ్చు. ఎందుకంటే హోలీ సెలవుతో పాటు వీకెండ్ హాలిడేస్ కూడా తోడయ్యాయి. దింతో వరుసగా మూడురోజులు సెలవులు రానున్నాయి. ఈ హోలీకి మార్కెట్లో కూడా సందడితో కనిపిస్తోంది. అలాగే హోలీకి సుమారు 60 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని భావిస్తున్నారు. మార్కెట్లో రంగులు, స్వీట్లు, పూజా సామాగ్రి, బట్టలు మొదలైన వాటి భారీ అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యయాలు పెరగడం వల్ల వివిధ వ్యాపార రంగాలలో హోలీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వైట్ టీ-షర్టులు, కుర్తా-పైజామా, రంగులతో ఆడుకోవడానికి సల్వార్ సూట్ల వంటి వాటికీ డిమాండ్ కనిపిస్తుంది.

గత సంవత్సరాలలాగానే ఈసారి కూడా హోలీ అమ్మకాల సమయంలో వ్యాపారాలు చైనా ఉత్పత్తులను బహిష్కరించారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు. భారతదేశంలో తయారైన రంగులు, పూజా సామాగ్రి సహా మొదలైనవి భారీ మొత్తంలో అమ్ముడవుతున్నాయి. ఈసారి మార్కెట్లో స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ ఐటమ్స్, పూలు, పండ్లు, బట్టలు, ఫర్నిషింగ్ ఫాబ్రిక్, కిరాణా, FMCG ఉత్పత్తులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇతర ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉందని ఆయన అన్నారు.
ఎంత వ్యాపారం జరుగుతుందంటే: CAT డేటా ప్రకారం, ఈ సంవత్సరం హోలీ రోజున రూ. 60 వేల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. అంటే గత సంవత్సరం కంటే దాదాపు 20 శాతం ఎక్కువ. గత సంవత్సరం హోలీ బిజినెస్ దాదాపు రూ.50 వేల కోట్లు. ఒక అంచనా ప్రకారం దేశ రాజధాని ఒక్క ఢిల్లీ మార్కెట్లలోనే రూ.8 వేల కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ఉంది.హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, ఫుడ్ ఇంకా రుచికరమైన వంటకాల పండుగ కూడా. అయితే ఊహించినట్లుగానే ఈసారి స్వీట్ షాపుల్లో అమ్మకాలలో భారీ పెరుగుదలను ఉండొచ్చు. హోలీ వేడుకల సందర్భంగా అన్ని ప్రముఖ నగరాల్లో బాంకెట్ హాళ్లు, ఫామ్‌హౌస్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లిక్ పార్కులు రకరకాల కార్యక్రమాలకి బుక్ అయ్యాయి. అయితే హోలీ రోజున ఉపయోగించే రంగుల పట్ల జాగ్రత్త వహించాలని, కెమికల్స్'తో కూడిన రంగులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకి ఈ హోలీ రోజున వాటర్ కలర్స్ ద్వారా సెలెబ్రేషన్స్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications