HOB vs POI: సోషల్ మీడియాలో ట్రోల్స్‌పై HOB వివరణ.. ఒక్కపోస్ట్‌తో షాక్ ఇచ్చిన HON ఫౌండర్
HOB vs POI: ఇండియన్ స్టోరీ టెల్లింగ్ ప్లాట్ ఫారమ్ హ్యూమన్స్ ఆఫ్ బాంబే(HOB), కంటెంట్ ప్లాట్ ఫారమ్ పీపుల్ ఆఫ్ ఇండియా(POI) మధ్య వివాదం చెలరేగింది. HOB కోర్టుని ఆశ్రయించగా.. సామాజిక మాధ్యమాల్లో యూజర్స్ ఆ సంస్థను ట్రోల్ చేస్తున్నారు.
POI కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని HOB ఆరోపిస్తోంది. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు ఇన్ స్టాగ్రామ్ కు సమన్లు సైతం జారీచేసింది. 'HOB చిత్రాలను POI గణనీయంగా అనుకరిస్తుంది. కొన్ని సందర్భాల్లో చిత్రాలు సైతం ఒకే విధంగా ఉన్నాయి' అని న్యాయస్థానం పేర్కొంది. అయితే HOB కూడా హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్(HON)ను అనుకరిస్తోందని, POI పై కేసును విత్ డ్రా చేసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో HOB తన చర్యలపై వివరణ ఇచ్చింది. ఇక్కడ స్టోరీ టెల్లింగ్ సమస్య కాదని తమ మేధో సంపత్తి(IP)ని రక్షించుకునే లక్ష్యంతోనే కోర్టుకు వెళ్లినట్లు పేర్కొంది. 'మా బృందం కృషిని కాపాడాలని మేము భావిస్తున్నాం. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించే ముందే సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాం' అని Xలో HOB పోస్ట్ చేసింది.
ఇదిలా ఉండగా హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్(HON) వ్యవస్థాపకులు బ్రాండన్ స్టాంటన్ ఈ వ్యవహారంపై స్పందించారు. తనపని కాని వాటిపై రెస్పాండ్ కావడం మానుకున్నానంటూ X పోస్ట్ లో తన నిరాశను వ్యక్తం చేశారు. తాను HOBపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారు మరో స్టోరీ టెల్లింగ్ ప్లాట్ ఫారమ్ పై దావా వేయడాన్ని వారి నిర్ణయానికి వదిలేస్తున్నట్లు చెప్పారు. అయితే పూర్తి వివరాలు అర్థం చేసుకోవాలని HOB ఆయనను కోరింది.


Click it and Unblock the Notifications