IT Notices: ఇటీవల ఆదాయపుపన్ను శాఖ స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటూ పన్ను ఎగవేతదారుల ఆట కట్టిస్తోంది. దొరికిన ఏ ఏఅవకాశాన్నీ వదలకుండా బకాయిలను ముక్కు పిండి వసూలు చేస్తోంది. తాజాగా ఇప్పుడు ఆ విభాగం దృష్టి మరోవైపు మళ్లింది. పలువురు దేశం వెలుపల కూడబెట్టుకున్న ఆస్తుల లెక్క బయటకు తీసేందుకు పావులు కదుపుతోంది.
నల్లధనంపై యుద్ధం ప్రకటించిన మోదీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. దీంతో కోటీశ్వరుల ఆటలు సాగడం లేదు. గతంలో స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహిస్తూ, భారీగా బ్లాక్ మనీ అక్కడ కూడబెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కుదరడం లేదు. ఎందుకంటే ఆ దేశానితో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా అక్కడ అకౌంట్స్ కలిగిన వారి వివరాలు ప్రభుత్వానికి అందజేయబడతాయి. దీంతో ప్రత్యామ్యాలపై వారు దృష్టిపెట్టారు. ఆదాయపు పన్ను శాఖ కూడా వారిని వెంబడించడం స్టార్ట్ చేసింది.

ఇందుకోసం దేశం వెలుపల వివిధ రకాలుగా పెట్టుబడి పెట్టిన HNIల వివరాలను తవ్వితీస్తోంది. వారంతా ఇప్పుడు IT విభాగం స్కానర్ లో ఉన్నారు. విదేశాల్లో ఉన్న తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఇప్పటికే వేలాది మందికి నోటీసు అందజేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. స్విట్జర్లాండ్, పోర్చుగల్ వంటి దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో భారతీయుల పెట్టుబడులు పెరిగినట్లు తేలడంతో నోటీసులతో సరిపెట్టకుండా సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
IT విభాగం ఇప్పటివరకు జరిపిన తన రీసెర్చ్ లో భారత్‌లో కంటే విదేశాల్లో ఆస్తులు చౌకగా ఉన్నట్లు కనుగొంది. పెద్ద ఎత్తున దేశంలోకి బహుళజాతి కంపెనీల(MNCల)ప్రవాహం పెరగడంతో పాత సంస్థలు తమ వాటాలను విక్రయించి భారీగా సొమ్ము కూడబెట్టినట్లు అర్థమైంది. దీంతో HNIలు ఇండియాలో కంటే ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్ల పలువురు HNIలు భారత్‌ను వదిలి వెళ్లిపోతున్నట్లు తేల్చింది.


Click it and Unblock the Notifications