IPO News: లాభాల్లో లిస్ట్ అయిన HMA Agro ఐపీవో.. కొనొచ్చా.. అమ్మేయాలా..? హోల్డ్ చేస్తే..
HMA Agro IPO: మార్కెట్లోకి నేడు హెచ్ఎమ్ఏ ఆగ్రో ఇండస్ట్రీస్ షేర్లు లిస్ట్ అయ్యాయి. ఇవి ఇష్యూ ధర కంటే ఎక్కువకు ప్రీమియం ధరకు లిస్ట్ అయ్యాయి. బ్రోకరేజీల అంచనాలను తప్పక గమనించాలి.

ఈరోజు ఎక్స్చేంజీల్లో ఐపీవో షేర్లు మంచి లాభాలను ఇన్వెస్టర్లకు అందించింది. బీఎస్ఈలో స్టాక్ ధర రూ.615కు, ఎన్ఎస్ఈలో రూ.625 వద్ద లిస్ట్ అయ్యింది. ఆగ్రో IPO లిస్టింగ్‌లో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు 7 శాతం లిస్టింగ్ గెయిన్ అందుకున్నారు. స్టాక్ లిస్టింగ్ తర్వాత మరింతగా పెరిగింది. కంపెనీ ఐపీవోలో పాల్గొన్న ఇన్వెస్టర్లకు ఒక్కో షేరును రూ.585 ధరకు కేటాయించింది.

గేదె మాంసం ఎగుమతి వ్యాపారంలో ఉన్న కంపెనీ త్రైమాసిక ఫలితాలను ఇటీవల వెలువరించింది. భారతదేశంలో వ్యాపారంలో తాము మార్కెట్ లీడర్లుగా ఉన్నట్లు వెల్లడించింది. రానున్న రోజుల్లో లిస్టింగ్ తర్వాత మెుదటి త్రైమాసిక ఫలితాలు విడుదలైతే అది స్టాక్ ర్యాలీకి తోడ్పడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న ఒకటి రెండు నెలల్లో స్టాక్ ధర రూ.750కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

స్వల్ప కాలిక లాభాల కోసం కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వారు త్రైమాసిక ఫలితాల వరకు వేచి చూస్తే క్షీణతను నమోదు చేసే ప్రమాదం ఉన్నందున లాభాల స్వీకరణకు మెుగ్గు చూపటం వల్ల మంచిదని ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ సూచించారు. అలాగే కొంత మేర రిస్క్ తీసుకోవాలనుకునే ఇన్వెస్టర్లు త్రైమాసిక ఫలితాల విడుదల వరకు వేచి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నం 2.02 గంటల సమయంలో స్టాక్ 4.70 శాతం లాభపడి రూ.612 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications