For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

3 లక్షల కోట్ల డాలర్లు దాటిన ఇన్వెస్టర్ల సంపద, 20 ఏళ్లులో BSE మైల్ స్టోన్స్ ఇవే...

|

బీఎస్ఈ చరిత్రలో మొదటిసారి లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సోమవారం 3 లక్షల కోట్ల డాలర్లను దాటింది. 2.5 లక్షల కోట్ల డాలర్ల నుండి 159 రోజుల్లోనే 500 బిలియన్ డాలర్లు పెరిగి 3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. 2002 మార్చి నెలలో 125 బిలియన్ డాలర్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ నేడు 3 లక్షల కోట్ల డాలర్లకు చేరువలో ఉంది. 2002లో మార్చిలో 125 బిలియన్ డాలర్లు, 2005 ఆగస్ట్ నెలలో 500 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

2007 మే 8న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 1 లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంది. 2014 జూన్ 6వ తేదీన 1.5 లక్షల కోట్ల డాలర్లకు, 2017 జూలై 10వ తేదీన 2 లక్షల కోట్ల డాలర్లకు, 2020 డిసెంబర్ 16వ తేదీన 2.5 లక్షల కోట్ల డాలర్లను తాకింది. 2021 మే 24వ తేదీన 3 లక్షల కోట్ల డాలర్లు క్రాస్ చేసింది.

Hits $3 trillion m cap for the first time ever, milestones of BSE

మార్కెట్ క్యాప్ పరంగా టాప్ టెన్ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1248648.41 కోట్లతో ముందు ఉంది. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ.1168234.40 కోట్లు), HDFC బ్యాంకు (రూ.814313.45 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.595429.55 కోట్లు), హిందూస్తాన్ యూనీలీవర్ (రూ.552846.51 కోట్లు), HDFC (రూ.463298.77 కోట్లు), ICICI బ్యాంకు (రూ.451582.90 కోట్లు), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.369077.31 కోట్లు), బజాజ్ ఫైనాన్స్ (రూ.348373.53 కోట్లు), కొటక్ మహీంద్రా బ్యాంకు (రూ.345054.46 కోట్లు)గా ఉంది.

English summary

3 లక్షల కోట్ల డాలర్లు దాటిన ఇన్వెస్టర్ల సంపద, 20 ఏళ్లులో BSE మైల్ స్టోన్స్ ఇవే... | Hits $3 trillion m cap for the first time ever, milestones of BSE

stock exchange BSE on Monday said the cumulative market cap of the all listed companies on its platform hit the $3 trillion mark intraday for the first time in history.
Story first published: Wednesday, May 26, 2021, 20:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X