HITEC City real estate 2025 : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. ఇప్పటికే భారతదేశ టెక్ మ్యాప్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. టెక్ రంగంలో నగరానికి పెట్టని కోటగా ఉన్న హైటెక్ సిటీతో ప్రపంచానికి ధీటుగా సవాల్ విసురుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాల ప్రధాన కేంద్రాలు ఇక్కడే ఉండటంతో.. ఇక్కడ అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఈ ప్రాంతం కేవలం టెక్నాలజీ హబ్ మాత్రమే కాకుండా.. రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు మంచి లాభాలను ఇచ్చే గమ్యస్థానంగా నిలుస్తోంది.
హైటెక్ సిటీ ప్రధాన టెక్ కారిడార్‌లో ఉండటమే దీని బలంగా చెప్పుకోవచ్చు. టెక్ నిపుణులు, కార్పొరేట్లు తమ పనిస్థలానికి దగ్గరగా నివసించాలని కోరుకోవడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. కేవలం టెక్ ఉద్యోగులతోనే ఇక్కడి నివాస ప్రాజెక్టులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఔటర్ రింగ్ రోడ్, MMTS, త్వరలో రానున్న మెట్రో విస్తరణ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభ కనెక్టివిటీ ఈ అంశాలన్నీ హైటెక్ సిటీని రియాల్టీలో మకుటం లేని మహారాజుగా నిలుపుతున్నాయి.

హైటెక్ సిటీలో గేటెడ్ కమ్యూనిటీలు, విలాసవంతమైన ఎత్తైన భవనాలు ప్రతి సంవత్సరం రెండంకెల మూలధన పెరుగుదల సాధిస్తున్నాయి. దీని వల్ల ఇది కేవలం దేశీయ కొనుగోలుదారులకే కాదు, దీర్ఘకాలిక లాభాలను ఆశించే NRI పెట్టుబడిదారులకు కూడా ప్రముఖ గమ్యస్థానంగా మారింది. దీనికి తోడు అంతర్జాతీయ పాఠశాలలు, ప్రీమియం ఆసుపత్రులు, లగ్జరీ మాల్స్, వినోద కేంద్రాలు ఇలా రకరకాల హంగులతో హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ వర్థిల్లుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొత్త కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులతో డెవలపర్లు దూసుకువస్తున్నారు. స్మార్ట్ హోమ్స్, వెల్నెస్ కాన్సెప్ట్‌లతో కూడిన టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేస్తున్నారు.
హైటెక్ సిటీ సమీపంలో రాబోతున్న కొత్త ప్రాజెక్టులు
వాసవి స్కైలా: 3, 4, 5 BHK, ధర రూ. 1.9-4 కోట్లు.. ఇప్పుడు బుక్ చేసుకుంటే 2027 కి స్వాధీనం చేస్తారు. ఎత్తైన లగ్జరీ టవర్స్, స్కై లాంజ్, ప్రీమియం క్లబ్‌హౌస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
సైబర్ సిటీ ఒరియానా: 2-4 BHK. దీని ధర రూ. 1.1-4.3 కోట్లు. 2025 నాటికి మీ చేతికి వస్తుంది... గ్రీన్ సర్టిఫైడ్, వాక్-టు-వర్క్ సౌలభ్యం వంటివి ఉన్నాయి.
ఆరో ది పెర్ల్ Auro The Pearl (Phase I & II) : అల్ట్రా లగ్జరీ 4 BHK, ధర రూ. 6.3-6.9 కోట్లు, 5300 చదరపు అడుగులు. 2028 నాటికి మీ చేతికి వస్తుందని అంచనా..
శ్రీముఖ్ నమిత 360 లైఫ్: 2400-4850 చదరపు అడుగులు, ధర రూ. 2.2-4.5 కోట్లు. 2025 ఏడాది చివరకు మీ చేతికి వస్తుందని అంచనా.. వెల్నెస్ థీమ్ టవర్స్ దీని ప్రాముఖ్యత.
Kohinoor by Auro Realty: 1430-3100 చదరపు అడుగులు, దీని ధర రూ. 1.2-4.5 కోట్లు, స్వాధీనం 2026 నాటికి.. స్మార్ట్ హోమ్ కాన్సెప్ట్‌లు ప్లస్ పాయింట్..
ఐటీ కంపెనీల కొత్త ప్రధాన కార్యాలయాలు, MNCల సౌకర్యాలు, స్టార్టప్‌లకు అనుకూలమైన కో-వర్కింగ్ స్పేస్‌లు ఇవన్నీ హైటెక్ సిటీని కమర్షియల్ రియల్ ఎస్టేట్ హబ్‌గా మారుస్తున్నాయి. ఆరో రియాల్టీ గెలాక్సీ వంటి 25 అంతస్తుల ఐకానిక్ టవర్స్, అరబిందో కక్ష్య, బాస్ టవర్స్, పూర్వ సమ్మిట్ వంటి ఐటీ పార్కులు నేటి ఆధునిక మౌలిక సదుపాయాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications