భారత టెక్ రంగానికి టీసీఎస్ ఉద్యోగ తొలగింపులు పెద్ద షాకిస్తున్నాయి. ఐటీ రంగానికి పెను సంక్షోభాన్ని మిగిల్చే దిశగా 12 వేల ఉద్యోగ తొలగింపులు కనిపిస్తున్నాయి. ఈ ప్రకటనతో ఐటీ రంగం షేర్లు నేడు కుప్పకూలాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీరంగంలో తీవ్రమైన కలకలం రేపుతోంది టీసీఎస్ లేఆప్స్. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఇది 2008 నాటి సంక్షోభాన్ని గుర్తుకు తెస్తోంది. 2008లో ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భయంతొ పాటు అమెరికాలో నెలకొన్న సంక్షోభం 2008లో భారత స్టాక్ మార్కెట్ తో పాటు ఐటీ రంగాన్ని కుదిపేసింది. తాజాగా టీసీఎస్ ప్రకటించిన లేఆఫ్స్ కూడా మళ్లీ ఇదే సంక్షోభాన్ని తెచ్చేలా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ 2008 సంక్షోభం ఏమిటీ? భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా పడింది?
లెహ్‌మాన్ బ్రదర్స్ బ్యాంక్ పతనం: 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం.. అమెరికాలో లెహ్‌మాన్ బ్రదర్స్ బ్యాంక్ పతనంతో మొదలైంది.ఈ బ్యాంక్ కుప్పకూలడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నమ్మకం కోల్పోయారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను గాడితప్పించింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఐటీ రంగం కూడా దీని తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొన్నది. ఆ ఏడాది ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యంతో భారత ఐటీ రంగం అనేక ఒడిదుడుకులకు లోనైంది. అమెరికాలో ప్రారంభమైన ఈ ఆర్థిక సంక్షోభం.. అమెరికన్ మార్కెట్‌పై ఆధారపడే భారతీయ ఐటీ కంపెనీలను భారీగా దెబ్బ తీసింది.దీనివల్ల వృద్ధి మందగించడమే కాదు, ఉద్యోగ నష్టాలు, ప్రాజెక్టు జాప్యాలు వంటి అనేక సమస్యలు ఎదురయ్యాయి.

అమెరికా నుంచి తగ్గిపోయిన ప్రాజెక్టులు: భారతీయ ఐటీ సంస్థల ఆదాయంలో అత్యధిక శాతం అగ్రరాజ్యం అమెరికా మార్కెట్ నుంచే వస్తుంది. అయితే 2008 సంక్షోభ సమయంలో అమెరికన్ కంపెనీలు ఖర్చులను గణనీయంగా తగ్గించడంతో, భారత సంస్థలకు వచ్చే ప్రాజెక్టుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా వంటి రంగాలలో అవుట్‌సోర్సింగ్ సేవలకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా దేశంలో ఐటీ కంపెనీలకు ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు : భారతీయ స్టాక్ మార్కెట్ ఉత్సాహంగా పరుగులు తీస్తున్న సమయంలో లెహ్మాన్ బ్రదర్స్ బ్యాంక్ కుప్పకూలడం ఒక్కసారిగా పెట్టుబడిదారుల భయం కమ్మేసింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) ఒకదాని తరువాత ఒకటి షేర్లను విక్రయించడం ప్రారంభించారు. భారతదేశంలో డబ్బు పెట్టుబడి పెట్టిన చాలా మంది విదేశీయులు తమ డబ్బును వెంటనే వెనక్కి తీసుకున్నారు. దీంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ వంటి సూచీలు శరవేగంగా క్షీణించాయి. లక్షలాది చిన్న పెట్టుబడిదారులు తమ జీవిత పొదుపును కోల్పోయారు. ఇంత పెద్ద పతనానికి కారణం? అమెరికాలోని సంక్షోభం మాత్రమే కాదు, మన స్వంత వ్యవస్థలో ఉన్న కొంత అదుపు తప్పిన ఆశాభావం కూడా.
ఉద్యోగ తొలగింపులు: ఆర్థిక ఒత్తిడిలో ఉన్న అమెరికా కంపెనీలు అనేక ఐటీ ప్రాజెక్టులను రద్దు చేశాయి లేదా వాయిదా వేసాయి. ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ ఆధారిత కంపెనీలకు ఇది పెద్ద ఒడిదుడుకుగా మారింది. ఇప్పటికే అమలులో ఉన్న ఒప్పందాలు నిలిపివేయబడ్డాయి, కొత్త ఒప్పందాలు రావడం ఆలస్యం అయ్యింది. దీంతో కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించుకోవాల్సి వచ్చింది. భారతదేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలు, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటివి ఉద్యోగుల తొలగింపులు, నియామకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రాజెక్టులు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం వల్ల వేలాది మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు.
తగ్గిన ఉద్యోగ అవకాశాలు: భారతీయ ఐటీ కంపెనీలు నష్టాలను తగ్గించడానికి తమ సేవతో పాటు క్లయింట్ స్థావరాన్ని వైవిధ్యపరచడం ప్రారంభించాయి. తక్కువ ఖర్చుతో కూడిన ప్రోగ్రామింగ్ కంటే కన్సల్టింగ్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్, ఆటోమేషన్ వంటి మరిన్ని విలువ ఆధారిత సేవలను అందించే దిశగా గుర్తించదగిన మార్పు వచ్చింది.2008-09లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ గణనీయంగా తగ్గింది. కొత్త గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి, పోటీ అధికమైంది. దాంతో పాటు ఉద్యోగ భద్రతపై అనిశ్చితి నెలకొంది. అయితే అన్ని కంపెనీలు ఒకే విధంగా ప్రభావిత కాలేదు. బలమైన దేశీయ క్లయింట్లతో పాటు, మార్కెట్ల వైవిధ్యాన్ని కలిగి ఉన్న సంస్థలు మాత్రం సంక్షోభాన్ని తట్టుకుని ముందుకు సాగాయి. ఈ సంస్థలు తమ వ్యూహాలను మార్చుకుని, కొంతవరకు వృద్ధిని నమోదు చేశాయి.
నిధులు లేక మూతపడిన స్టార్టప్‌లు: వెంచర్ క్యాపిటలిస్టులు మరింత జాగ్రత్తగా వ్యవహరించడం ప్రారంభించారు. ఫలితంగా స్టార్టప్‌లు నిధుల కోసం పోటీపడి, అభివృద్ధిలో నిలకడను ఎదుర్కొన్నాయి. ఇది టెక్ పర్యావరణంలో ఆవిష్కరణకు ఒక తాత్కాలిక అడ్డంకిగా మారింది. భారత స్టార్టప్ పర్యావరణం ఎదుగుదల దశలో ఉండగా, వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా మారారు. అనేక స్టార్టప్‌లు ఆర్థిక మద్దతు లేక మూతపడిపోయాయి. ఇది టెక్ ఆవిష్కరణల్లో గ్యాప్‌కు దారి తీసింది.ఈ మాంద్యం, వ్యయ నియంత్రణ, మార్కెట్ వైవిధ్యీకరణ, స్థిరత ప్రాధాన్యతల గురించి కంపెనీలకు స్పష్టత ఇచ్చింది. చాలా కంపెనీలు తమ సేవలను, టెక్నాలజీలను, కార్యకలాపాలను కొత్తగా ఆలోచించడం ప్రారంభించాయి.
త్వరతిగతిన భారత ప్రభుత్వం చర్యలు : అయితే భారత ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ మాంద్యాన్ని ఎదుర్కొనడంలో కీలకంగా వ్యవహరించాయి. ఫిస్కల్ స్టిమ్యులస్, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి చర్యలతో ఐటీ రంగానికి ఊరట కలిగించింది. వడ్డీ రేట్లు తగ్గింపు ద్వారా రుణాలు చౌకగా మారి, వినియోగదారులు ఖర్చు పెంచేందుకు RBI ప్రయత్నించింది. మౌలిక ప్రాజెక్టులపై భారీగా ఖర్చు పెట్టి, ఉద్యోగాలను నిర్మించేందుకు ప్రభుత్వ పెట్టుబడుల ద్వారా ప్రణాళికలు రూపొందించాయి. బ్యాంకింగ్ వ్యవస్థపై నియంత్రణలు కఠినతరం చేసి, తదుపరి సంక్షోభాలకు అవకాశం లేకుండా చేసింది.FDI నిబంధనల సడలింపు ద్వారా విదేశీ పెట్టుబడిదారులలో నమ్మకం పెంచే ప్రయత్నం జరిగింది.
ఏది ఏమైనా 2008సంక్షోభం భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలంగా పరీక్షించింది. మన ఆర్థిక వ్యవస్థ విదేశీ పెట్టుబడులపై అధికంగా ఆధారపడిన వాస్తవాన్ని ఈ సంక్షోభం బయటపడింది. అప్పట్లో ఇండియన్ రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ బలంగా వృద్ధి చెందుతున్నాయనే అభిప్రాయం ఉండేది. అయితే అవి ముడిపడి ఉన్న వాస్తవికతను పక్కన పెట్టారు.అప్పుడే ఆర్థిక వ్యవస్థలో కొంత "బబుల్" అనేది తయారైంది. ఈరోజు మనం డిజిటల్ ఇండియా, AI, గ్లోబల్ స్టార్టప్‌ల దేశంగా ఎదుగుతున్నా ఇదంతా 2008 గుణపాఠం నుంచే మొదలైంది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications