చరిత్రలోనే తొలిసారిగా భారత్‌లో వెండి కొరత.. తీవ్ర ఆందోళనతో షేక్ అయిన లండన్ మార్కెట్‌

భారతదేశం వెండి మార్కెట్‌లో అనూహ్యమైన డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకోవడంతో.. ప్రపంచంలోని బులియన్ హబ్‌లలో ఒకటైన లండన్‌లో భయాందోళనలు చెలరేగాయి. దీపావళి పండుగ సీజన్‌లో లక్షలాది మంది భారతీయులు దేవీ లక్ష్మీ ఆరాధనలో భాగంగా వెండిని కొనుగోలు చేయడంతో దేశీయ మార్కెట్లో ఉన్న వెండి స్టాక్ పూర్తిగా ఖాళీ అయిపోయింది.పండుగ డిమాండ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు వెండిపై దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగాయి.

గత వారం చివర్లో భారత వెండి మార్కెట్ చరిత్రలో తొలిసారిగా పూర్తి స్థాయిలో స్టాక్ అయిపోయిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద బులియన్ బ్యాంక్‌లలో ఒకటైన JP Morgan Chase & Co. భారతదేశానికి అక్టోబర్ నెలకు వెండి సరఫరా కేటాయింపులు పూర్తయ్యాయని తన క్లయింట్లకు తెలిపింది. తదుపరి సరఫరా నవంబర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ కథనం తెలిపింది.

India silver shortage London bullion market silver demand India silver imports 2025 Diwali silver demand Indian silver rush global silver prices silver market crisis London silver vaults silver supply crunch precious metals shortage silver investment India silver jewelry demand silver bullion India global commodities news 2025

MMTC-Pamp India Pvt లో ట్రేడింగ్ హెడ్ విపిన్ రైనా మాట్లాడుతూ.. వెండిపై ఇంత పిచ్చి డిమాండ్ నేను 27 ఏళ్ల కెరీర్‌లో చూడలేదు. ప్రస్తుతం చాలా మంది వెండి డీలర్లు, నాణేలు సరఫరాదారులు స్టాక్ లేకపోవడంతో సేల్స్ ఆపివేశారని అన్నారు.ఈ డిమాండ్‌ను మరింత వేగవంతం చేసింది సోషల్ మీడియా. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, కంటెంట్ క్రియేటర్ సార్థక్ అహుజా తన 3 మిలియన్ ఫాలోవర్‌లతో వెండిని బంగారం కంటే తెలివైన పెట్టుబడిగా ప్రచారం చేయడంతో యువత పెద్ద ఎత్తున కొనుగోళ్లలోకి దూసుకెళ్లారు. అక్షయ తృతీయ సందర్భంగా చేసిన ఆయన వీడియో వైరల్ కావడంతో సిల్వర్ రష్ మొదలైంది.

MD ఓవర్సీస్ బులియన్ జనరల్ మేనేజర్ అమిత్ మిట్టల్ ప్రకారం ఇంతకు ముందు ఎప్పుడూ ఇంతటి డిమాండ్ చూడలేదు. ప్రపంచ Silver ధరలపై ఔన్సుకు ప్రీమియం $0.50 నుంచి $5కి పెరిగింది. దీని కారణంగా కొనుగోలుదారుల మధ్య బిడ్డింగ్ యుద్ధాలు చెలరేగాయి.అలాగే చైనా సెలవుదినాలు, గ్లోబల్ సప్లై పరిమితులు, అమెరికా డాలర్ బలహీనతపై పందెం వేసిన పెట్టుబడిదారుల డిమాండ్.. ఇలా అన్నీ కలిసివచ్చి పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేశాయి. అక్టోబర్ ప్రారంభంలో లండన్ వాల్ట్‌లు దాదాపు ఖాళీ అయ్యాయి. వెండిపై రుణ వడ్డీలు వార్షికంగా 200%కు పెరిగాయని తెలిపారు.

స్విస్ రిఫైనర్ అర్గోర్-హెరాయస్ సహ-CEO రాబిన్ కోల్వెన్‌బాచ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. లండన్‌లో ఇప్పుడు వెండి లిక్విడిటీ దాదాపు లేనట్టే ఉంది. కాంట్రాక్ట్ కాని వెండి సరఫరా తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల వెండి ధర ఔన్సుకు 54 డాలర్లు దాటింది. అయితే గత వారం చివర్లో 6.7 శాతం తక్షణ పతనం నమోదైంది. హంట్ సోదరులు మార్కెట్‌ను నియంత్రించడానికి ప్రయత్నించిన 1980 తరువాత ఇంత తీవ్రమైన మార్కెట్ ఒత్తిడి ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, న్యూయార్క్ నుంచి లండన్‌కు వెండి రవాణాలో లాజిస్టికల్ సమస్యలు పెరగడంతో గ్లోబల్ సప్లై చైన్ పూర్తిగా అస్తవ్యస్తమైంది.కోటక్ అసెట్ మేనేజ్‌మెంట్ వంటి సంస్థలు వెండి ఆధారిత నిధులపై కొత్త చందాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. భారత పండుగ సీజన్‌లో ప్రారంభమైన ఈ వెండి జ్వరం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. భారత్‌లోని రిటైల్ డిమాండ్ లండన్‌లోని లిక్విడిటీ క్రైసిస్ కలిపి వెండి మార్కెట్‌ను చరిత్రలోనే అతిపెద్ద ఒత్తిడిలోకి నెట్టాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+