డ్రాగన్ కంట్రీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, భారీ బంగారు నిక్షేపాల గనిని కనుగొంది. చైనాలోని మధ్య భాగంలో గల హునాన్ ప్రావిన్స్‌లో ఈ అత్యంత విలువైన ఖనిజ నిక్షేపం ఉన్నట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా నిర్ధారించింది. ఈ Gold సంపద చైనా ఆర్థిక వ్యవస్థతో పాటు హైటెక్ తయారీ రంగాలకు కీలకమైన బంగారం వంటి వనరుపై దేశానికి మరింత నియంత్రణను తీసుకురావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నిక్షేపం ఉన్న ప్రాంతం, అక్కడి భూగర్భ నిర్మాణం, ఖనిజ కూర్పు అసాధారణంగా అధిక విలువ కలిగిన ఆస్తిని సూచిస్తున్నాయి. విదేశీ అస్థిరతల ప్రభావం తగ్గించడంతో పాటు, దేశీయ ఖనిజ ఉత్పత్తిని బలోపేతం చేయాలనే బీజింగ్ వ్యూహంలో భాగంగానే ఈ ఆవిష్కరణ చోటు చేసుకుందని తెలుస్తోంది.

చైనా మీడియా నివేదికల ప్రకారం.. ఈ ప్రదేశంలో అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. అదనపు వనరుల మ్యాపింగ్, భూగర్భ పరిశోధనలు 2026 వరకు కొనసాగనున్నాయి. హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్జియాంగ్ కౌంటీలో ఉన్న వాంగు బంగారు క్షేత్రంలో 1,000 మెట్రిక్ టన్నులకు పైగా బంగారం ఉన్నట్లు హునాన్ జియోలాజికల్ బ్యూరో అధికారులు నవంబర్ 2025లో ధృవీకరించారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ బంగారం విలువ సుమారు 83 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
ఈ నిక్షేపంలో ఇప్పటివరకు ధృవీకరించబడిన భాగం సుమారు 2 వేల మీటర్ల లోతులో ఉంది. ఇందులో 40 వేర్వేరు Gold సిరలలో దాదాపు 300 టన్నుల కొలిచిన నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇక్కడి ధాతువు నాణ్యత విశేషంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రయోగశాల పరీక్షల ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో టన్నుకు 138 గ్రాముల వరకు బంగారం గ్రేడ్ ఉన్నట్లు గుర్తించారు. ఇది పరిశ్రమలో హై-గ్రేడ్ డిపాజిట్‌గా పరిగణించబడే పరిమితిని చాలా మించి ఉంది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా బంగారు గనుల్లో టన్నుకు 10 గ్రాముల కంటే తక్కువ ధాతువునే ప్రాసెస్ చేస్తారు.
ఇప్పటివరకు 65 కిలోమీటర్లకు పైగా అన్వేషణాత్మక డ్రిల్లింగ్ నిర్వహించగా.. సేకరించిన కోర్ నమూనాల్లో అనేక మండలాల్లో బంగారం ఉన్నట్లు తేలింది.డ్రిల్లింగ్ ఫలితాలు ఈ నిక్షేపం ప్రస్తుతం మ్యాప్ చేసిన సరిహద్దులను మించి విస్తరించే అవకాశముందని సూచిస్తున్నాయి. ఈ మొత్తం అన్వేషణ పనులు 2024లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ యాజమాన్య సంస్థ హునాన్ మినరల్ రిసోర్సెస్ గ్రూప్ పర్యవేక్షణలో సాగుతున్నాయి.
ఇటీవల Nature Geoscience జర్నల్‌లో ప్రచురితమైన ఒక పీర్-రివ్యూడ్ అధ్యయనం... వాంగు నిక్షేపం లాంటి హై-గ్రేడ్ బంగారు నిల్వలు ఎలా ఏర్పడతాయన్నదానిపై కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. టెక్టోనిక్ ఒత్తిడికి గురైన క్వార్ట్జ్ అధికంగా ఉన్న రాళ్లు పైజోఎలెక్ట్రిక్ ఛార్జ్‌లను ఉత్పత్తి చేసి.. చుట్టుపక్కల ఉన్న హైడ్రోథర్మల్ ద్రవాల నుంచి బంగారం వేగంగా అవక్షేపించడానికి కారణమవుతాయని ఈ అధ్యయనం చెబుతోంది. వాంగు నిక్షేపాన్ని నేరుగా ఈ అధ్యయనం ప్రస్తావించకపోయినా, అక్కడి భూగర్భ పరిస్థితులు ఈ సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ నిక్షేపం పూర్తిగా ధృవీకరించబడితే.. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న సౌత్ డీప్ గని కంటే కూడా పెద్దదిగా మారే అవకాశం ఉంది. సౌత్ డీప్‌లో సుమారు 900 టన్నుల బంగారం ఉందని అంచనా. చైనా వాంగు క్షేత్రంలో అధిక ధాతువు సాంద్రత ఉండడం వల్ల తక్కువ పదార్థాన్ని ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. దీని వల్ల శక్తి ఖర్చులు తగ్గడమే కాకుండా, పర్యావరణ ప్రభావాలు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది.అయితే ఈ నిక్షేపం వాణిజ్య ఉత్పత్తికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై ఇంకా స్పష్టమైన కాలక్రమాన్ని చైనా ప్రకటించలేదు. అయినప్పటికీ, ఈ సూపర్‌జెయింట్ బంగారు నిక్షేపం చైనాకు ప్రపంచ బంగారు మార్కెట్‌పై మరింత ప్రభావాన్ని కలిగించే శక్తిని అందిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications