IT News: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చితి వల్ల లేఆఫ్ లు ఎక్కువయ్యాయి. ఆయా సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉద్యోగాల్లో కోతలు విధించడం, సిబ్బందిపై వేటు వేయడం చేస్తున్నాయి. వీటికి తోడు కొత్తవారి నియామకాలను సైతం దాదాపుగా స్తంభింపజేశాయి. ఫ్రెషర్స్ ఏమి చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు.
గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈసారి హైరింగ్ కార్యకలాపాలు 7 శాతం మందగించాయని ఫౌండ్‌ఇట్ ఇన్‌సైట్స్ ట్రాకర్ నివేదిక తెలిపింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటూ, జాగ్రత్త వహించే విధానాన్ని అవలంబిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు నెలవారీ నియామకాల ట్రెండ్‌పై ఫౌండ్‌ఇట్ తన తాజా అన్వేషణలను విడుదల చేసింది.

సాధారణ క్షీణత ఉన్నప్పటికీ అహ్మదాబాద్ మరియు జైపూర్ వంటి టైర్ II నగరాల్లో మాత్రం సానుకూల ధోరణి కనిపించినట్లు నివేదిక పేర్కొంది. అయితే 4 శాతం MoM క్షీణతతో అన్ని పరిశ్రమల్లో నియామక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. నైపుణ్యాల అంతరం వల్ల అర్హత కలిగిన అభ్యర్థులను గుర్తించడం సవాలుగా మారడమూ నియామక ప్రక్రియను క్లిష్టతరం చేసినట్లు అభిప్రాయపడింది.
"ప్రస్తుత నియామకాల ట్రెండ్.. భారతదేశ జాబ్ మార్కెట్ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తుంది. అయితే వీటి మధ్య ఉద్యోగార్ధులకు అవకాశాలు అందించే పరిస్థితులూ ఉన్నాయి. సమీప భవిష్యత్తులో హైరింగ్ సవాలుగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నందున.. పరిశ్రమల అంతటా నియామకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాము. ఉద్యోగార్ధులు కూడా మారుతున్న లేబర్ మార్కెట్‌కు అనుగుణంగా ఉండటం చాలా కీలకం. నిరంతరం నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను పొందడం చాలా ముఖ్యం" అని మే 2023 ట్రెండ్ గురించి ఫౌండ్‌ఇట్ CEO శేఖర్ గరిసా వ్యాఖ్యానించారు.
అనేక ప్రధాన నగరాల్లోని IT హబ్స్ నియామకాల్లో భారీ క్షీణతను చవిచూశాయి. బెంగళూరు అత్యధికంగా 24 శాతం.. ఢిల్లీ, ముంబై, పూణె మరియు హైదరాబాద్‌లు 9 నుంచి 16 శాతం వరకు గణనీయమైన క్షీణతను నమోదుచేశాయి. అయితే అంచనాలను తలక్రిందులు చేస్తూ అహ్మదాబాద్ ప్రత్యేకంగా నిలిచింది. ఇక్కడ మాత్రం నియామకాల్లో 8 శాతం పెరుగుదల కనిపించింది. జైపూర్ కూడా 1 శాతం స్వల్ప వృద్ధిని ప్రదర్శించింది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications