నవంబర్ నెలలో ఉద్యోగ నియామకాలు భారీగా పెరిగాయి. నవంబర్ నెల పండుగ సీజన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు సరాసరి 26 శాతం పెరిగినట్లు జాబ్ పోర్టల్ నౌకరీ డాట్ కామ్ వెల్లడించింది. నవంబర్ నెలకు సంబంధించిన నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్‌లో నియామకాల పాయింట్స్ 2173 వద్ద ట్రెండ్ అవుతున్నాయి. అదే నియామకాల పాయింట్స్ గత ఏడాది నవంబర్ నెలలో 1727గా ఉందని తెలిపింది. నివేదిక ప్రకారం గత ఏడాది నవంబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ నెలలో రిటైల్ రంగంలో నియామకాలు 47 శాతం పెరిగాయి. హాస్పిటాలిటీ, పర్యాటక రంగంలో 58 శాతం, విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో విద్యారంగంలో 54 శాతం నియామకాలు పెరిగాయి. బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ రంగంలో 30 శాతం, ఐటీ రంగంలో 50 శాతం పెరిగాయి. ఆహార ఉత్పత్తుల రంగంలో 6 శాతం, హెల్త్ రంగంలో 3 శాతం నియామకాలు పెరిగాయి.
మెట్రో నగరాల్లో నియామకాల జోరు కొనసాగుతోంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో నియామకాలు స్వల్పంగా ఉన్నాయి. నగరాలవారీగా చూస్తే బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 49 శాతం, హైదరాబాద్, పుణే నగరాల్లో 47 శాతం చొప్పున, ముంబైలో 36 శాతం, చెన్నైలో 35 శాతం, ఢిల్లీలో 34 శాతం, కోల్‌కతాలో 23 శాతం చొప్పున నియామకాలు పెరిగాయి. ద్వితీయశ్రేణి నగరాల విషయానికి వస్తే ఇక్కడ 16 శాతం పెరిగాయి. నాన్-మెట్రో నగరాల్లో అత్యధికంగా 61 శాతం అహ్మదాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. కోయంబత్తూరులో 28 శాతంతో నిలిచింది. వృత్తిపరమైన అనుభవం ఉన్న వ్యక్తులకు సంబంధించి నియామకాలు జోరుగా సాగాయి. 8 నుండి 12 ఏళ్ల వృత్తి అనుభవం ఉన్న వ్యక్తుల నియామకాలు అత్యధికంగా 37 శాతం, 4 నుండి 7 ఏళ్ల అనుభవం ఉన్న వారి నియామకం 30 శాతం, మూడేళ్లలోపు అనుభవం ఉన్నవారి నియామకం 27 శాతం, 16 ఏళ్ల వరకు అనుభవం ఉన్నవారి నియామకం 26 శాతం, పదహారేళ్లకు మించి అనుభవం ఉన్నవారి నియామకాలు 20 శాతం పెరిగాయి.

అంతర్జాతీయంగా కూడా పేరోల్స్ పెరిగినట్లు ఏటీపీ నివేదిక తెలిపింది. అమెరికాలో ప్రయివేటు హైరింగ్ గత నెలలో 5,34,000 మేర పెరిగాయని, అంతకుముందు డౌజోన్స్ అంచనా వేసిన 5,06,000 కంటే ఇది ఎక్కువ అని చెబుతున్నారు. అయితే అక్టోబర్ నెల 5,70,000 కంటే మాత్రం ఇది కాస్త తక్కువే. ఇటీవల ఆర్థిక రికవరీ కనిపించడంతో ఎక్కువగా హాస్పిటాలిటీ రంగం పుంజుకుంది. ఈ రంగంలో ఉండే బార్స్, రెస్టారెంట్లు, హోటల్స్ తదితర వ్యాపారాల్లో 1,36,0000 నియామకాలు పెరిగాయి. ప్రొఫెషనల్స్, బిసినెస్ సేవల్లో 1,10,000, ట్రాన్సుపోర్టేషన్, యుటిలిటీస్ రంగంలో 78,000, ఎడ్యుకేషన్, హెల్త్ రంగంలో 55,000 నియామకాలు పెరిగాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications