Buzzing Stock: ఒక్కరోజే 18 శాతం పెరిగిన స్టాక్.. సరికొత్త రికార్డు సృష్టి.. మీ దగ్గర ఉందేమో చూస్తోండి
Hindustan Zinc: ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న వేళ పీఎస్‌యూ షేర్లలో ఎన్నడూ చూడని స్థాయిలో విజృంభిస్తున్నాయి. సంచలన రికార్డులు సృష్టిస్తున్న షేరు నేడు తన కొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది వేదాంత గ్రూప్‌తో అనుబంధం ఉన్న ఒక కంపెనీ గత కొద్ది రోజులుగా ఇన్వెస్టర్లకు బలమైన రాబడిని అందిస్తోంది. ఈ క్రమంలోనే నేడు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ షేర్లు ఇంట్రాడేలో 18 శాతానికి పైగా పెరిగాయి. మే 21న ఇంట్రాడే ట్రేడ్‌లో హిందుస్థాన్ జింక్ షేర్లు 13.12 శాతం పెరుగుదలతో తమ ఆల్-టైమ్ రికార్డు గరిష్ట స్థాయి రూ.700కి చేరుకున్న సంగతి తెలిసిందే. బీఎస్ఈలో రికార్డు స్థాయిలో నేడు స్టాక్ అత్యధికంగా 18.46 శాతం పెరిగి రూ.733.20ను తాకాయి.

అలాగే క్యూ4 త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ తన ఇన్వెస్టర్లకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.10 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. 2024 క్యాలెండర్ సంవత్సరం ప్రారంభం నుంచి మనం హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ షేర్ల పనితీరును గమనిస్తే.. 115 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. కంపెనీ షేర్లకు మధ్య కాలానికి రూ.750 టార్గెట్ ధరను అరిహంత్ క్యాపిటల్ టెక్నికల్ అనాలిసిస్ హెడ్ రత్నేష్ గోయల్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు స్టాక్ పతనమైతే కొనుగోలు చేయటంపై ప్లాన్ చేసుకోవచ్చని అన్నారు.
హిందుస్థాన్ జింక్‌లో వేదాంత గ్రూప్‌కు అత్యధికంగా 64.92% వాటా ఉండగా.. మిగిలిన వాటా భారత ప్రభుత్వం హోల్డ్ చేస్తోంది. హిందుస్థాన్ జింక్ కార్యకలాపాల్లో సీసం-జింక్ గనులు, హైడ్రోమెటలర్జికల్ జింక్ స్మెల్టర్, సీసం స్మెల్టర్, పైరో మెటలర్జికల్ లెడ్-జింక్ స్మెల్టర్ అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్, క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. కంపెనీ ప్రాథమికంగా మైనింగ్, ఖనిజాల వ్యాపారంలో ఉంది.


Click it and Unblock the Notifications