Hindustan Unilever: ఎఫ్ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనీలివర్ తన మెుదటి త్రైమాసిక ఫలితాలను నేడు విడుదల చేసింది. సవాలుతో కూడిన వాతావరణంలో పనిచేస్తున్నప్పటికీ FMCG పరిశ్రమ క్రమంగా పుంజుకుంటున్నట్లు ఫలితాల ద్వారా కనిపిస్తోంది.
జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌యూఎల్ లాభం 6.9 శాతం వృద్ధిని నమోదుతో రూ.2,556 కోట్లుగా నమోదు చేసింది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.2,391 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసింది. తాజా ఫలితాల ప్రకారం మొదటి త్రైమాసికంలో ఏకీకృత మొత్తం ఆదాయం రూ.15,679 కోట్లుగా ఉంది.

ఆపరేటింగ్ వాతావరణం సవాలుగా ఉన్నప్పటికీ FMCG మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నట్లు HUL సీఈవో, ఎండీ రోహిత్ జావా వెల్లడించారు. హోమ్ కేర్ సెగ్మెంట్ 10 శాతం ఆదాయ వృద్ధితో త్రైమాసికంలో బలమైన పనితీరును అందించిందని తెలిపారు. అలాగే బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ విభాగం 4 శాతం వృద్ధి చెందినట్లు చెప్పారు. హెల్డీ ఫుడ్ అండ్ బెవరేజస్ వ్యాపారం 5 శాతం వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ ప్రకటించింది.
కస్టమర్లకు ఉత్తమమైన విలువను అందించేందుకు తమ బ్రాండ్లపై పెట్టుబడులను కొనసాగిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. కంపెనీ తన బోర్డులో ఆగస్టు 1, 2023 నుంచి నీలం ధావాను స్వతంత్ర డైరెక్టర్‌గా ఐదేళ్ల కాలానికి, అక్టోబర్ 12, 2023 నుంచి అక్టోబర్ 11, 2028 వరకు ఐదేళ్ల పాటు లియో పూరీని తిరిగి స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించినట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications