Hindustan Uniliver: ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో ఇండియాలో అతిపెద్ద సంస్థగా హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీకి మంచి మార్కెట్ ఉంది. కంపెనీ గడచిన కొన్నాళ్లుగా తమ వ్యాపారాలను రీస్రక్చరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీ తాజాగా తన ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైయర్ వ్యాపారాన్ని విక్రయించాలని చూస్తోంది. మీడియా నివేదికల ప్రకారం దీని కోసం కంపెనీ కొంతమంది కొనుగోలుదారులతో చర్చలు కూడా జరుపుతోందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు.

నివేదికల ప్రకారం హిందుస్థాన్ యూనీలివర్ ప్యూరిట్ విక్రయంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. అయితే దానికి ఉన్న అవకాశాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించబడింది. గడచిన కొన్ని నెలలుగా దీనికి సంబంధించిన విక్రయ చర్చలు జరిగినట్లు వెల్లడైంది. ఇందులో ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి.. Pureit వ్యాపార విక్రయానికి సంబంధించిన చర్చలు దాని మాతృ సంస్థ Unilever Plc నీటి శుద్ధి పరికరాలను తయారు చేసే చైనాకు చెందిన Qinyuan గ్రూప్‌లో తన మెజారిటీ వాటాను విక్రయిస్తున్న సందర్భంలో వచ్చాయి.
యూనీలివర్ చైనా కంపెనీలో 2014లో వాటాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వాటాల విక్రయ డీల్ విలువ సుమారు 300 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి హిందుస్థాన్ యూనీలివర్ ఈ వ్యాపారంలోకి 2004లో ప్రవేశించింది. కంపెనీ యురేకా ఫోర్బ్స్, కెంట్ వంటి స్థాపించబడిన బ్రాండ్‌లతో పోటీ పడేందుకు హిందుస్థాన్ యూనీలివర్ ఎంట్రీ-లెవల్ గ్రావిటీ వాటర్ ప్యూరిఫైయర్‌తో ప్యూరిఫైయర్ మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. కంపెనీ 2011లో రివర్స్ ఆస్మాసిస్ వాటర్ ప్యూరిఫైయర్‌ను ప్రారంభించి నేడు భారతీయ మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తోంది.
గత కొంత కాలంగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు వాటర్ ప్యూరిఫైయర్ వ్యాపారంపై ఆసక్తి చూపుతున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ 2021లో యురేకా ఫోర్బ్స్‌లో వాటాను దాని మాజీ యజమాని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి దాదాపు రూ.4,400 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువతో కొనుగోలు చేసింది. యురేకా ఫోర్బ్స్ ప్రముఖ ఆక్వాగార్డ్ బ్రాండ్ క్రింద వాటర్ ప్యూరిఫైయర్‌లను విక్రయిస్తోంది. ఈ కంపెనీ వాక్యూమ్ క్లీనర్లతో పాటు ఇతర కన్జూమర్ డ్యూరబుల్ ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications