ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) పామాయిల్ ఉత్పత్తిలో సహకరించడానికి చర్చలు జరుపుతున్నాయని హిందుస్థాన్ ఎఫ్ఎంసీజీ మేనేజర్ చెప్పారు. రెండు వైపులా పామ్ ప్లాంటేషన్, ఆయిల్ మిల్లును ఏర్పాటు చేయాలని చూస్తున్నాయిని తెలుస్తోంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 ఉద్యోగాలు రానున్నాయి.
పామాయిల్ పరిశ్రమలలో విస్తృత వినియోగం పెరుగుతోంది. బిస్కెట్ల నుంచి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వరకు పామాయిల్ ను వినియోగిస్తారు. ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ దిగుమతి చేసుకునే దేశంగా భారత్ ఉంది. పామాయిల్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలనే కోరికను ఏపీ ప్రభుత్వం వ్యక్తం చేసింది. రైతులు, పరిశ్రమల ప్రయోజనాలు పొందడంతో పాటు
వస్తువుల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతోంది.

హిందుస్థాన్ యూనిలివర్ కనీసం 30,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రాలో 15,000 మంది రైతులతో చర్చలు జరుపతోంది. ప్రతిపాదిత ప్రణాళికలో నారు నర్సరీలు, తాటి తాజా పండ్ల సేకరణ కేంద్రాలు, రాష్ట్రంలో అత్యాధునిక ఆయిల్ మిల్లును ఏర్పాటు చేయడం, ప్రాజెక్ట్ అభివృద్ధి వ్యవధిలో రూ. 300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడం వంటివి ఉన్నాయని కంపెనీ తెలిపింది.
ఫిబ్రవరి 12న నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, సహకారం, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితో హెచ్‌యుఎల్ ప్రతినిధులు, వ్యవసాయరంగంలో రాష్ట్రంతో భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని హెచ్‌యుఎల్ పునరుద్ఘాటించింది. హిందూస్థాన్ యూనిలివర్ వ్యవసాయ విస్తరణ సేవలను కూడా అందిస్తుంది. ఉత్తమ-తరగతి వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడానికి సమగ్ర రైతు ఔట్రీచ్ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications