దేశంలో ప్రముఖ FMCG కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలీవర్ సబ్బులు, డిటర్జెంట్ ధరలు తగ్గించింది. ప్రొడక్ట్ బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు వెల్లడించింది. గతంలో ముడిసరకు ధరలు పెరుగడంతో హెచ్‌యూఎల్ సహా ఇతర కంపెనీలు గత కొన్ని విడతల వారీగా ధరలను పెంచాయి. అయితే ముడిసరకు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

లైఫ్‌బాయ్
తగ్గిన ధరలు కలిగిన స్టాక్ ఈ నెలాఖరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హెచ్‌యూఎల్ విక్రయించే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ 500 ఎంఎల్ ధర ప్రస్తుతం రూ.115 ఉండగా.. దాన్ని రూ.112కి తగ్గించింది. రిన్ డిటర్జెంట్ కేజీ పౌడర్ ధర రూ.103 నుంచి రూ.99కి చేరనుంది. లైఫ్‌బాయ్ 125 గ్రాముల 4 సోప్‌లు ఉండే ప్యాక్ ధర రూ.140 నుంచి రూ.132కి తగ్గించనుంది.

15 రోజుల తర్వాతే
50 గ్రాముల డవ్ సబ్బు ధర రూ.27 నుంచి రూ.22కి తగ్గనుంది. తగ్గించిన ధరల సమాచారం ఆ కంపెనీ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు అందజేసింది. తగ్గించిన ధరలు కలిగిన ఉత్పత్తులు 15 రోజుల తర్వాతే మార్కెట్‌లోకి వస్తాయని తెలుస్తోంది.

గోద్రెజ్
మరో FMCG కంపెనీ అయిన గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మొదటగా ఈ ధరలు తగ్గింపు నిర్ణయం తీసుకుంది. గత నెలలో ఆ కంపెనీ కొన్నింటికి ధరలు తగ్గించగా.. మరికొన్ని ఉత్పత్తుల పరిమాణం పెంచింది. రూ.10కు లభించే నం.1 సబ్బు బరువును 41 గ్రాముల నుంచి 50 గ్రాములకు పెంచిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications