Stock in Focus: రక్షణశాఖ ఆయుధ కొనుగోలు.. రూ.32,000 కోట్ల ఆర్డర్ కొట్టేసిన భారత కంపెనీ..
Stock in Focus: కేంద్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా భారత రక్షణ దళాల ఆధునీకరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా రూ.70,000 కోట్లు విలువైన వివిధ ఆయుధవ్యవస్థలను కొనుగోలు చేసే ప్రతిపాదనను ఆమోదించింది. దీనికి సంబంధించిన వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో వెల్లడించారు.

భారత కంపెనీ..
భారీగా ఆయుధాలను సమీకరణలో భారత సంస్థ మెగా ఆర్డర్ కొట్టేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి రూ.32,000 కోట్ల విలువైన 60 యూహెచ్ మెరైన్ ఛాపర్లను కొనుగోలు ఈ డీల్‌లో భాగంగా ఉంది. ఇది కాకుండా.. నౌకాదళానికి 60 మేడ్ ఇన్ ఇండియా యుటిలిటీ హెలికాప్టర్లు మెరైన్ & బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, భారత సైన్యం కోసం 307 ATAGS హోవిట్జర్లు, ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం 9 ALH ధృవ్ ఛాపర్లకు ఆర్డర్ దక్కించుకుంది.

వరుస ఆర్డర్లు..
నెల రోజులుగా హెచ్‌ఏఎల్‌కు వరుస ఆర్డర్లు క్యూ కడుతున్నాయి. మార్చి 10న భారత వైమానిక దళం కోసం 6 డోమియర్-228 విమానాల కోసం HALతో మంత్రిత్వ శాఖ రూ. 667 కోట్ల కాంట్రాక్టును కుదుర్చుకుంది. రూ.6,828.36 కోట్లతో హెచ్‌ఏఎల్ నుంచి 70 హెచ్‌టీటీ-40 బేసిక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసేందుకు ఈ నెల ప్రారంభంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఆర్డర్ బుక్..
వరుస ఆర్డర్లతో హెచ్ఏఎల్ ఆర్డర్ బుక్ నిండుగా మారింది. ఇప్పటికే రూ.84,000 కోట్ల విలువైన ఆర్డర్లను తయారు చేస్తున్న సంస్థకు తాజాగా మరో రూ.50,000 కోట్ల విలువైన ఆర్డర్ పైప్‌లైన్ ఉందని హెచ్‌ఏఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీబీ అనంతకృష్ణన్ ఇటీవల వెల్లడించారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వానికి చెందిన మరో మెగా ఆర్డర్ ను కంపెనీ సొంతం చేసుకుంది. ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ ఇటీవల అద్బుతమైన పనితీరును కనబరుస్తోంది. ఉదయం 9.33 గంటల సమయంలో స్టాక్ ధర 3.31 శాతం మేర పెరిగి రూ.2,813 వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఈ సంస్థ స్వాతంత్య్రానికి ముందే 1940లో స్థాపించటం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న సంస్థ షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ.20 డివిడెండ్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications